అప్లై చేసుకోండి.. LICలో AAO, AE ఉద్యోగాలు

  • Publish Date - February 29, 2020 / 08:18 AM IST

ముంబయి ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. 218 అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులకు అర్హతగల అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు.   

అభ్యర్ధులు సంబంధిత విభాగంలో B-TECH, B.E, M-TECH, MA లాంటి కోర్సులు పూర్తి చేసినవారు దరఖాస్తు చేయొచ్చు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తుకు మార్చి 15, 2029 చివరి తేదీ. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

విభాగాలు వారీగా:
అసిస్టెంట్ ఇంజనీర్ (AE) – 50.
అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ – 168.
మొత్తం ఖాళీలు – 218.

వయస్సు:
అభ్యర్ధులకు 21 నుంచి 30 ఏళ్లు. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు రూ.700. SC,ST, దివ్యాంగులు మాత్రం రూ.85 చెల్లిస్తే సరిపోతుంది.