JOBS : బీఆర్ ఓలో ఉద్యోగ ఖాళీల భర్తీ

అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టుల్ని అనుసరించి పదో తరగతి,ఇంటర్మీడియట్‌ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత సర్టిఫికేట్‌ కోర్సులతోపాటు పని అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి

Bro

JOBS : న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న భారత ప్రభుత్వ రోడ్డు రవాణ, రహదారుల మంత్రిత్వశాఖకు చెందిన బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌(బీఆర్‌ఓ)లో పలు ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 1178 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టులకు సంబంధించి మల్టీ స్కిల్డ్‌ వర్కర్‌(మాసన్‌), మల్టీ స్కిల్డ్‌ వర్కర్‌(నర్సింగ్‌ అసిస్టెంట్‌), స్టోర్‌ కీపర్‌ టెక్నికల్‌, తదితర పోస్టులు ఉన్నాయి.

అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టుల్ని అనుసరించి పదో తరగతి,ఇంటర్మీడియట్‌ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత సర్టిఫికేట్‌ కోర్సులతోపాటు పని అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు
చేసుకోవాలి. దరఖాస్తులకు చివరితేది 2022, జూలై 22గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: http://www.bro.gov.in/ పరిశీలించగలరు.