Job Fair: పది పాసయ్యారా.. టెక్ మహీంద్రా, గ్రీన్ టెక్ సంస్థల్లో ఉద్యోగాలు.. రూ.2.8 లక్షల జీతం.. రిజిస్ట్రేషన్, పూర్తి వివరాలు

Job Fair: APSSDC సంస్థ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. పదవ తరగతి మొదలకొని ఆపై చదువులు చదివి ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గాల్లో జాబ్ మేళాలు నిర్వహిస్తోంది.

Mega Job Mela in Nandyal district under the auspices of APSSDC

ఏపీలోని నిరుద్యోగులకు APSSDC సంస్థ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. పదవ తరగతి మొదలకొని ఆపై చదువులు చదివి ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గాల్లో జాబ్ మేళాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే కొన్ని వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించింది. ఇందులో భాగంగానే ఇప్పుడు నంద్యాల జిల్లా ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో ఉన్న ఎన్టీఆర్ షాదీఖానాలో ఈనెల 21న మరో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈమేరకు జిల్లా ఉపాధికల్పన అధికారి పి. దీప్తి అధికారిక ప్రకటన చేశారు.

ఇక ఈ మెగా జాబ్ మేళాలో మొత్తం 11 ప్రముఖ కంపెనీలు పాల్గొనున్నాయి. టెక్ మహీంద్రా, గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్, ఆరంభిందో ఫార్మసి లాంటి సంస్థలు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయి. ఈ మెగా జాబ్ మేళాలో పదవ తరగతి నుంచి B.SC, MSC, బీటెక్, ఎంబీఏ ఏదైనా డిగ్రీ పూర్తి చేసుకున్న ఎవరైనా పాల్గొనవచ్చు. ఈ జాబ్ మేళాలో ఎంపికైన వారికి వార్షికంగా 2.8 లక్షల రూపాయల వరకు జీతం ఉండనుంది. కాబట్టి తప్పకుండ యువత ఈ అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఈ జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్తిలు రెజ్యూమ్, విద్యార్హతా జిరాక్సులు, ఆధార్ కార్డ్ , పాన్ కార్డ్ , పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకురావాలని రావాల్సి ఉంటుంది. అది కూడా ఫార్మల్ డ్రెస్ లోనే రావాల్సి ఉంటుంది. ముందస్తు రిజిస్ట్రేషన్ కోసం అధికారిక వెబ్ సైట్ https://naipunyam.ap.gov.in ని సంప్రదించాలి. అలాగే మరిన్ని వివరాలు, సందేహాల కోసం 9182217075, 9951400588 నంబర్లను సంప్రదించవచ్చు.