NFDC Recruitment : నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగ ఖాళీల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో పోస్టును బట్టి ఎస్‌ఎస్‌సీ, గ్రాడ్యుయేట్‌ డిగ్రీ , డిప్లొమా, సీఏ, ఐసీడబ్ల్యూఏ, డీఓపీ, పోస్టు గ్రాడ్యుయేషన్‌, బీకాం, బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంఏ, ఎంబీఏ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

NFDC Recruitment : నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగ ఖాళీల భర్తీ

National Film Development Corporation of India Vacancies

Updated On : April 20, 2023 / 2:07 PM IST

NFDC Recruitment : ముంబయిలోని నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్‌ ఇండియా (ఎన్‌ఎఫ్‌డీసీ)లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 35 గార్డెనింగ్‌ సూపర్‌వైజర్‌, సీనియర్‌ కో ఆర్డినేటర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌, గ్రాఫిక్‌ డిజైనర్‌, ఆఫీస్‌ అసిస్టెంట్‌, కంటెంట్‌ రైటర్‌ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

READ ALSO : Organic Fertilizers : వ్యవసాయంలో సేంద్రీయ ఎరువుల వినియోగంతో అధిక దిగుబడులతోపాటు, ఖర్చులు తక్కువే!

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో పోస్టును బట్టి ఎస్‌ఎస్‌సీ, గ్రాడ్యుయేట్‌ డిగ్రీ , డిప్లొమా, సీఏ, ఐసీడబ్ల్యూఏ, డీఓపీ, పోస్టు గ్రాడ్యుయేషన్‌, బీకాం, బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంఏ, ఎంబీఏ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో ఏడాది నుంచి ఐదేళ్ల అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 30 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

READ ALSO : Sapota Forming : నికరమైన ఆదాయాన్నిస్తున్న సపోట సాగు

ఈ అర్హతలున్న వారు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపేందుకు మే 1, 2023వ తుదిగడువుగా నిర్ణయించారు. విద్యార్హతలు, ఇంటర్వ్యూ, అనుభవం ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.20,000ల నుంచి రూ.85,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. దరఖాస్తులు పంపాల్సి చిరునామా ; నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, 5వ అంతస్తు, NMIC బిల్డింగ్, NFDC – FD కాంప్లెక్స్, 24, పెద్దర్ రోడ్, కుంబల్లా హిల్, ముంబై – 400 026. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.nfdcindia.com/ పరిశీలించగలరు.