NEET PG-2020 పరీక్ష ఫలితాలు వచ్చేసాయి

  • Publish Date - April 11, 2020 / 09:12 AM IST

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్(NEET-2020) మొదటి విడత కౌన్సిలింగ్ ఫలితాలను మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ విడుదల చేసింది. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ నెల (ఏప్రిల్ 20,2020)లోగా సంబంధిత కాలేజీలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. 

ఈ పరీక్షలు దేశవ్యాప్తంగా 169 నగరాల్లో జనవరి 5వ తేదీన మెడికల్ పీజీ ఎంట్రన్స్ కోసం నిర్వహించారు. మొత్తం1,60,888 మంది పరిక్షకు హాజరయ్యారు. 

ఒకవేళ మొదటి రౌండ్లో సీట్ అలాట్మెంట్ రిజల్ట్ లో సీట్ వచ్చి కూడా కాలేజీలో రిపోర్ట్ చేయనివారు రెండో రౌండ్లో పాల్గొనవచ్చు.