హైదరాబాద్ : మారుతున్న రోజులకు..విద్యావ్యవస్థ మారాల్సిన అవసరముంది. ఆయా సబ్జెక్ట్స్ లలో కొత్త కొత్త కోర్సులు వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో అవసరాలకు తగ్గట్లు స్టూటెండ్స్ తయారుకావాలి. దీంతో బీటెక్ స్థాయిలోనే కొత్త కోర్సులతో పాటు డిమాండ్ ఉన్న సబ్జెక్టులపై శిక్షణ ఇవ్వాలని పలువురు కోరుతున్నారు. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) బీటెక్ లో తొమ్మిది కొత్త సబ్జెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సాఫ్ట్‌వేర్ రంగంలో దూసుకొస్తున్న కొత్త టెక్నాలజీలకు పెద్దపీట వేస్తు.. బీటెక్ కోర్సులను రూపొందించేందకు చర్యలు తీసుకుంటున్నారు. దీనికి ఐఐటీ హైదరాబాద్ పాలకమండలి ఛైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి ఛైర్మన్‌గా నియమించిన కమిటీ సిఫారసు చేసింది. ఈ కమిటీ రెండు నెలలలోపే మొత్తం 9 సబ్జెక్టుల్లో పాఠ్య ప్రణాళికలను ఏఐసీటీఈ ఖరారు చేసింది.
దేశవ్యాప్తంగా 8 లక్షల మంది బీటెక్ విద్యార్థులు ప్రతీ సంవత్సరం వస్తున్నారు. కానీ వీరికి ఐటీ కోరుకునే స్కిల్స్ ఉండటం లేదని కమిటీ అభిప్రాయపడింది. బీటెక్ స్థాయిలోనే రోబోటిక్స్, కృత్రిమ మేధ, బిగ్ డేటా లాంటి వాటిపై ప్రధాన దృష్టి ఉండే కోర్సులను ప్రవేశపెట్టాలని ఆ కమిటీ 2018 డిసెంబర్ లో సిఫారసు చేసింది. ఏఐసీటీఈ వైస్ ఛైర్మన్ పూనియా సూచన మేరకు చండీగఢ్‌లోని జాతీయ సాంకేతిక ఉపాధ్యాయుల శిక్షణ, పరిశోధన సంస్థ(ఎన్‌ఐటీటీటీఆర్) ఈ సిలబస్‌ను రూపొందించింది. అందులో పనిచేస్తున్న ఏపీకి చెందిన ప్రొఫెసర్ సి.రామకృష్ణ కీలకంగా వ్యవహరించారు. ఒక్కో సబ్జెక్టును ఒక సెమిస్టర్‌లో ఒక పేపర్‌గా అందించేలా సిలబస్‌ను రూపొందించారు. వాటిని తప్పనిసరి సబ్జెక్టుగా లేదా ఎలెక్టివ్ సబ్జెక్టుగా ఎంచుకోవచ్చు. మొత్తం 45 గంటల పాటు థియరీ చెప్తారు. బీటెక్ లో ఆ కొత్త కోర్స్ లు ఇవే..