నార్తరన్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ లో ఆపరేటర్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తం 307 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్దులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
విభాగాల వారీగా ఖాళీలు :
డ్రాగ్ లైన్ ఆపరేటర్ – 9
డోజర్ ఆపరేటర్ – 48
గ్రేడర్ ఆపరేటర్ – 11
డంపర్ ఆపరేటర్ – 167
షోవల్ ఆపరేటర్ – 28
పే లోడర్ ఆపరేటర్ – 6
క్రేన్ ఆపరేటర్ – 21
డ్రిల్ ఆపరేటర్ – 17
విద్యార్హత : అభ్యర్దులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. వాలిడ్ హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
వయసు : అభ్యర్దులు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వడ్ అభ్యర్ధులకు వయసులో సడలింపులు వర్తిస్తాయి.
ఎంపికా విధానం : అభ్యర్దులను రాత పరీక్ష, టెక్నికల్ టెస్టు ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు : జనరల్, ఓబీసీ, EWS అభ్యర్దులు రూ. 500 చెల్లించాలి. SC, ST, డిపార్ట్ మెంటల్ అభ్యర్దులకు ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది.
ముఖ్య తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ : మార్చి 16, 2020.
దరఖాస్తు చివరి తేదీ : మార్చి 30, 2020.
See Also | దరఖాస్తు చేసుకోండి: ఇగ్నోలో MBA, PHD కోర్సుల్లో ప్రవేశాలు