Indian Air Force: పది పాసైతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో జాబ్స్.. నెలకు రూ.30 వేల జీతం.. వెంటనే అప్లై చేసుకోండి

పదవతరగతి పాసైన వారికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్(Indian Air Force) గుడ్ న్యూస్ చెప్పింది. అగ్నిపథ్ స్కీమ్ కింద అగ్నివీర్ వాయు

Notification released for Agniveer Vayu Non-Combatant posts in Indian Air Force

Indian Air Force: పదవతరగతి పాసైన వారికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గుడ్ న్యూస్ చెప్పింది. అగ్నిపథ్ స్కీమ్ కింద అగ్నివీర్ వాయు నాన్–కంబాటెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వాయుసేన(Indian Air Force) కేంద్రాల్లో హౌస్‌కీపింగ్, హాస్పిటాలిటీ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనుంది. దీనికి సంబందించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలవగా సెప్టెంబర్ 1వ తేదీతో ముగియనుంది. కాబట్టి, ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ agnipathvayu.cdac.in నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, కేవలం పెళ్లికాని పురుషులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

RRB Recruitment: ఆర్ఆర్బీలో 368 ఉద్యోగాలు.. నెలకు రూ.35 వేల జీతం.. దరఖాస్తు, లాస్ట్ డేట్ వివరాలు

విద్యార్హత:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి (మెట్రిక్యులేషన్) లేదా తత్సమాన విద్యను పూర్తి చేసి ఉండాలి.

వయోపరిమితి:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 21 సంవత్సరాలు మించకూడదు.

వేతనవివరాలు:
ఎంపికైనా అభ్యర్థులకు మొదటి ఏడాది నెలకు రూ.30,000 జీతం అందుతుంది. అలాగే ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.

ఎంపిక ప్రక్రియ:
ఈ పోస్టులకు సంబంధించిన ఎంపిక స్కిల్/ప్రాక్టికల్ టెస్ట్, శారీరక సామర్థ్య పరీక్ష, వైద్య పరీక్ష, దరఖాస్తుల పరిశీలన ద్వారా జరుగుతుంది.