న్యూక్లియర్ పవర్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(NPCIL) స్ట్రెఫండియరీ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మెుత్తం 185 ఖాళీలు ఉన్నాయి. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్ధులు ఎటువంటి ఫీజు చెల్లించవల్సిన అవసరం లేదు.
విభాగాల వారీగా ఖాళీలు :
స్ట్రెఫండియరీ ట్రైనీ ఆపరేటర్ – 70
స్ట్రెఫండియరీ ట్రైనీ మెయింటైనర్ – 105
డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ కమ్ ఫైర్ మెన్ – 10
విద్యార్హత : అభ్యర్ధులు 10వ తరగతి, ఇంటర్ లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి.
ముఖ్య తేదిలు :
దరఖాస్తు ప్రారంభ తేది : డిసెంబర్ 31, 2019.
దరఖాస్తు చివరి తేది : జనవరి 21, 2020.