టెన్త్ చదువుతున్న బాలికలకు.. NTR ట్రస్ట్ స్కాలర్‌ షిప్ టెస్ట్

  • Publish Date - December 12, 2019 / 07:12 AM IST

NTR ట్రస్ట్ ఇంటర్మీడియట్ చదవాలనుకునే అమ్మాయిలకు కోసం రూ.22 లక్షల స్కాలర్‌షిప్‌ను ప్రకటించింది. స్కాలర్‌షిప్‌ కు ఎంపిక చేసేందుకు ఈ నెల 15న గండిపేటలోని ఎన్టీఆర్ బాలికల జూనియర్, డిగ్రీ కళాశాలలో GEST స్కాలర్‌షిప్ టెస్ట్ నిర్వహించనుంది. మొత్తం 25 మంది అమ్మాయిలకు ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ స్కాలర్‌షిప్స్ లభించనున్నాయి. 

అయితే 10వ తరగతి చదువుతున్న బాలికలు మాత్రమే ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు. ఇక ఈ పరీక్ష మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. మ్యాథ్స్ 20మార్కులకు, సైన్స్ 20 మార్కులకు, సోషల్ 20 మార్కులకు, ఇంగ్లీష్ 20 మార్కులకు, కరెంట్ అఫైర్స్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ మూడు కలిపి 20 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. 2 గంటల్లో పరీక్ష రాయాలి. 

స్కాలర్‌షిప్ విధానం : 
GEST స్కాలర్‌షిప్ టెస్ట్‌లో మొదటి 10 ర్యాంకులు సాధించిన విద్యార్థినులకు నెలకు రూ.5,000 చొప్పున ఆర్థిక సాయం లభిస్తుంది. 11 నుంచి 25 ర్యాంకులు సాధించినవారికి నెలకు రూ.3,000 చొప్పున స్కాలర్‌షిప్ అందుతుంది.

పరీక్షకు కచ్చితంగా తీసుకెళ్లాలిసినవి:
అభ్యర్ధులు OMR ఫిల్ చేయడానికి కచ్చితంగా బ్లాక్ పెన్, ఎగ్జామ్ పాడ్ పరీక్ష కేంద్రానికి తీసుకెల్లాల్సి ఉంటుంది. 

విద్యార్హత :
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 2020 మార్చిలో 10వ తరగతి రాసే అమ్మాయిలందరూ GEST స్కాలర్‌షిప్ టెస్ట్‌‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యతేదిలు: 
దరఖాస్తుకు చివరి తేదీ: 2019 డిసెంబర్ 12. 
పరీక్ష తేది: డిసెంబర్ 15, 2019.
పరీక్ష సమయం: ఉదయం 10గంటల నుంచి 12గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు.