HPCL : హెచ్ పీసీఎల్ లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ

ఈ ఖాళీగా ఉన్న పోస్టులు ఇంజిన్, కొర్రోసియన్ రిసెర్చ్, క్రూడ్ అండ్ ఫ్యూయల్స్ రిసెర్చ్ తదితర విభాగాల్లో ఉన్నాయి. అభ్యర్ధుల అర్హత విషయానికి వస్తే సంబంధిత సబ్జెక్టుల్లో ఎంఈ, ఎంటెక్, పీహెచ్ డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

Hpcl Jobs

HPCL : హిందూస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ (హెచ్ పీసీఎల్) లో పలు పోస్టుల భర్తీకి గాను ఆసక్తిగల అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 25 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టులు ఖాళీల వివరాలకు సంబంధించి డిప్యూటీ జనరల్ మేనేజర్లు 5 ఖాళీలు, అసిస్టెంట్ మేనేజర్లు 8 ఖాళీలు, సీనియర్ ఆఫీసర్లు 12 ఖాళీలు ఉన్నాయి.

ఈ ఖాళీగా ఉన్న పోస్టులు ఇంజిన్, కొర్రోసియన్ రిసెర్చ్, క్రూడ్ అండ్ ఫ్యూయల్స్ రిసెర్చ్ తదితర విభాగాల్లో ఉన్నాయి. అభ్యర్ధుల అర్హత విషయానికి వస్తే సంబంధిత సబ్జెక్టుల్లో ఎంఈ, ఎంటెక్, పీహెచ్ డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవాన్ని కలిగి ఉండాలి. అభ్యర్ధుల ఎంపికను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ , గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక చేస్తారు.

ఆసక్తిగల అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ మార్చి 14, 2022న ప్రారంభమై, ఏప్రిల్ 18, 2022 నాటితో ముగుస్తుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ : www.hindustanpetroleum.com/ సంప్రదించగలరు.