Idrbt
IDRBT : హైదరాబాద్ లోని ఇన్ స్టిట్యూట్ ఫర్ డెవలప్ మెంట్ అండ్ రిసెర్చ్ బ్యాంకింగ్ టెక్నాలజీ లో తాత్కాలిక ప్రాతిపదికన పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 11 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
భర్తీ చేయనున్న పోస్టుల్లో టెక్నికల్ అర్కిటెక్ట్ 2 ఖాళీలు, డెవలపర్ 9ఖాళీలు, ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి.
అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో అందజేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు అందజేసేందుకు చివరితేదిగా మార్చి 03, 2022ను నిర్ణయించారు. పూర్తివివరాలకు వెబ్ సైట్ www.idrbt.ac.in/ సంప్రదించగలరు.