Rites Jobs : రైట్స్ సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో పోస్టుల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 40 ఏళ్ల లోపు ఉండాలి. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది. అభ్యర్ధుల ఎంపిక విధానానికి సంబంధించి తొలుత పని అనుభవం అధారంగా అభ్యర్ధులను షార్ట్ లిస్టు చేస్తారు.

Gold Glitter Defocused Texture Background. Gold Christmas Abstract Background

Rites Jobs : రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనమిక్ సర్వీస్ ( రైట్స్ ) సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో పలు పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 18 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో ఇంజనీర్, క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్, ఎస్ హెచ్ ఈ ఎక్స్ పర్ట్ , ప్లానింగ్ ఇంజనీరింగ్ తదితర పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల విద్యార్హతలకు సంబంధించి పోస్టుల అధారంగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్, బీఈ, బీఎస్సీ, ఎఏ, ఎంఎస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 40 ఏళ్ల లోపు ఉండాలి. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది. అభ్యర్ధుల ఎంపిక విధానానికి సంబంధించి తొలుత పని అనుభవం అధారంగా అభ్యర్ధులను షార్ట్ లిస్టు చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ అధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు వేతనంగా 25,158రూ చెల్లిస్తారు. దరఖాస్తుల పంపేందుకు జూన్ 1, 2022 చివరి తేదిగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.rites.com/ పరిశీలించగలరు.