దరఖాస్తు చేసుకోండి: RBIలో అసిస్టెంట్ ఉద్యోగాలు

  • Publish Date - December 26, 2019 / 09:33 AM IST

దేశవ్యాప్తంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 900లకు పైగా అసిస్టెంట్ పోస్టులను విడుదల చేసింది. ఇందుకు అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 16 జనవరి 2020.

ఎంపిక విధానం: 
అభ్యర్ధులు ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, లాంగ్వేజ్ ప్రొఫీషియెన్సీ టెస్ట్ ద్వారా అసిస్టెంట్ పోస్టుకు ఎంపిక చేస్తారు.

విద్యార్హతలు: 
అభ్యర్ధులు ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ 50% మార్కులతో పాస్ కావాలి. కంప్యూటర్‌లో వర్డ్ ప్రాసెసింగ్‌ తెలిసి ఉండాలి.

వయస్సు: 
అభ్యర్ధులు 20 నుంచి 28 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: 
అభ్యర్ధులు ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ ఇంటర్వ్యూ

దరఖాస్తు ఫీజు: 
అభ్యర్ధులు రూ. 450 చెల్లించాల్సి ఉంటుంది. SC, ST అభ్యర్థులు మాత్రం రూ.50 చెల్లిస్తే సరిపోతుంది. 

ముఖ్యతేదీలు:
దరఖాస్తు ప్రారంభం: డిసెంబర్ 23, 2019.
దరఖాస్తు చివరితేది: జనవరి 16, 2019.