రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు రీసెంట్ గా అధికారిక ప్రకటన విడుదల చేసింది.
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు రీసెంట్ గా అధికారిక ప్రకటన విడుదల చేసింది. అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి రాతపరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు నిర్వహించనున్న స్టేజ్-3 ఆప్టిట్యూడ్ టెస్ట్ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థులకు స్టేజ్ 3 ఆప్టిట్యూడ్ టెస్ట్ ఏప్రిల్ 16, 2019న నిర్వహించాల్సి ఉంది. పరీక్ష నిర్వహణకు సంబంధించిన తేదీలను త్వరలోనే తెలియజేస్తామని RRB వెల్లడించింది.
రెండో విడత రాతపరీక్షకు 70 శాతం వెయిటేజీ, ఆప్టిట్యూడ్ టెస్ట్‌కు 30 వెయిటేజీ మార్కులు ఇచ్చి ALP పోస్టుల మెరిట్ జాబితాను రూపొందిస్తారు. ఆప్టిట్యూడ్ టెస్టులో ఇంగ్లిష్, హిందీ భాషల్లో ప్రశ్నలు అడుగుతారు. ఈ పరీక్షలో కనీస అర్హత మార్కులను 42గా నిర్ణయించారు.
Read Also : అలహాబాద్ బ్యాంకులో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టులు