×
Ad

Sankranti School Holidays: స్కూళ్లకు సంక్రాంతి సెలవులు.. ఎప్పటి నుంచి అంటే..

ఎప్పటిలానే ఈసారి కూడా పండక్కి సొంతూరు వెళ్లేందుకు అంతా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా ముందుగానే ట్రైన్, బస్సు టికెట్లు బుక్ చేసుకుంటున్నారు.

Sankranti School Holidays: తెలుగు వారు జరుపుకునే అతి ముఖ్యమైన, అతి పెద్ద పండుగ సంక్రాంతి. కుటుంబసభ్యులు అంతా కలిసి పండుగను ఘనంగా జరుపుకుంటారు. చదువు, ఉపాధి నిమిత్తం ఎక్కడెక్కడో ఉన్న వారంతా పండక్కి సొంతూరికి వస్తారు. కుటుంబసభ్యులతో కలిసి సంక్రాంతిని ఆనందంగా జరుపుకుంటారు.

ఇక ప్రతి ఏటా సంక్రాంతికి విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వడం కామన్. అందుకే, సంక్రాంతి పండగ ఎప్పుడెప్పుడు వస్తుందా, సెలవుల్లో ఎంజాయ్ చేద్దామా అని విద్యార్థులు ఎదురు చూస్తారు. ఏపీలో స్కూళ్లకు ఎప్పటి నుంచి పండగ సెలవులు ఇచ్చారో తెలుసుకుందాం.

ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం ఈసారి సంక్రాంతి సెలవులు 2026 జనవరి 10 నుంచి ప్రారంభం కానున్నాయి. జనవరి 18 వరకు సెలవులు ఉంటాయి. మొత్తం 9 రోజులు సంక్రాంతి హాలిడేస్ రానున్నాయి. జనవరి 19 నుంచి స్కూల్స్ రీఓపెన్ కానున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు ఈ సెలవులు వర్తిస్తాయి. ఇక తెలంగాణ విషయానికి వస్తే.. జనవరి 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు సంక్రాంతి పండగ హాలిడేస్ ప్రకటించే అవకాశం ఉంది.

ఎప్పటిలానే ఈసారి కూడా పండక్కి సొంతూరు వెళ్లేందుకు అంతా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా ముందుగానే ట్రైన్, బస్సు టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. ఎలాగైనా పండక్కి ఇంట్లో ఉండేలా, కుటుంబసభ్యులతో కలిసి జరుపుకునేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

Also Read: నెలకు జస్ట్ రూ.250తో పెట్టుబడి.. మీ పిల్లలను కోటీశ్వరులుగా చేయొచ్చు.. ఫుల్ డిటెయిల్స్..!