నాన్ గెజిటెడ్ ప్రభుత్వ ఉద్యోగాలకు ఇకపై ఒకటే పరీక్ష

  • Publish Date - February 1, 2020 / 08:43 AM IST

నాన్ గెజిటెడ్ ప్రభుత్వ ఉద్యోగాలకు ఇకపై ఒకటే పరీక్ష నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర బడ్జెట్ 2020 ప్రవేశపెట్టిన సందర్భంగా నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. నాన్ గెజిటెడ్ పోస్టుల రిక్రూట్ మెంట్ కోసం నేషనల్ రిక్రూట్ మెంట్ ఏజెన్సీతో ప్రత్యేకమైన కామన్ టెస్ట్ నిర్ణయించేలా ప్రభుత్వం ప్రతిపాదించినట్టు ఆమె తెలిపారు.

ఈ పరీక్షకు సంబంధించి పరీక్షా కేంద్రాలు ప్రతి జిల్లాల్లో ప్రత్యేకించి అవసరమైన జిల్లాలో ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి నిర్మల చెప్పారు. ఒకే సింగిల్ టెస్టు నిర్వహించం ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎంతో ఈజీగా ఉంటుందని అన్నారు. 

కేంద్ర బడ్జెట్ 2020 – 21ను మంత్రి నిర్మల పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఫిబ్రవరి 01వ తేదీ ఉదయం 11.00గంటలకు ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం నిర్మలా ఇది రెండోసారి. సామాన్యుల బడ్జెట్‌గా ఆమె అభివర్ణించారు. ఆర్థిక ప్రగతికి సంస్కరణలు అవసరమని స్పష్టం చేశారు.

ప్రజల ఆదాయం పెంచేందుకు సత్వరచర్యలు తీసుకుంటున్నట్లు, ప్రజల ఆదాయం పెంచడమే బడ్జెట్ లక్ష్యమన్నారు. స‌బ్‌కా సాత్‌, స‌బ్‌కా వికాస్ అన్న నినాదంతో ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం పనిచేస్తోందని..ఈ బడ్జెట్ ప్రతీ ఒక్కరికి మేలు చేసే విధంగా రూపొందించామని తెలిపారు.