Small Industries Development Bank of India Vacancies
SIDBI Job Vacancies : స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(సిడ్బీ)లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 100 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ పోస్టులు ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బ్యాచిలర్స్ డిగ్రీ/ ఇంజినీరింగ్ డిగ్రీ/ పీజీ డిగ్రీ(కామర్స్/ ఎకనామిక్స్/ మేనేజ్‌మెంట్)/ సీఏ/సీఎస్/ సీడబ్ల్యూఏ/ సీఎఫ్‌ఏ/ సీఎంఏ/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 21 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పరీక్ష కేంద్రాలను తెలుగు రాష్ట్రాల్లోనూ ఏర్పాటు చేయనున్నారు.
దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 14-12-2022న ప్రారంభమవుతుండగా 03-01-2022తో ముగియనుంది. ఆన్‌లైన్ పరీక్షను వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలను 2023 ఫిబ్రవరిలో నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు, రాజమండ్రి, గుంటూరు, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.sidbi.in/en/careers/ పరిశీలించగలరు.