శానిటైజర్లు, మాస్కులు, డాక్టర్లు, ప్రత్యేక గదులు.. టెన్త్ పరీక్షలకు కరోనా జాగ్రత్తలు

తెలంగాణ రాష్ట్రంలో మార్చి 19వ తేదీ గురువారం నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా తెలుగు రాష్ట్రాల్లో కరోనా పంజా

  • Publish Date - March 18, 2020 / 02:23 AM IST

తెలంగాణ రాష్ట్రంలో మార్చి 19వ తేదీ గురువారం నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా తెలుగు రాష్ట్రాల్లో కరోనా పంజా

తెలంగాణ రాష్ట్రంలో మార్చి 19వ తేదీ గురువారం నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా తెలుగు రాష్ట్రాల్లో కరోనా పంజా విసురుతున్న నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. పలు జాగ్రత్తలు తీసుకున్నారు. విద్యార్థుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జలుబు, దగ్గుతో వచ్చే విద్యార్థులకు ప్రత్యేక రూమ్ లు ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్షా కేంద్రంలో శానిటైజర్ ఏర్పాటు చేస్తున్నారు. ఎగ్జామ్ సెంటర్ లోకి మాస్కులు, వాటర్ బాటిల్స్ అనుమతించాలని నిర్ణయించారు. అలాగే ముందు జాగ్రత్తగా ప్రతి పరీక్షా కేంద్రం దగ్గర ఇద్దరు డాక్టర్లను అందుబాటులో ఉంచనున్నారు. మార్చి 19న ప్రారంభం అయ్యే పరీక్షలు ఏప్రిల్ 6వ తేదీతో ముగుస్తాయి. విద్యార్థులు మాస్కులు ధరించినా అనుమతిస్తామన్నారు. పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లను రిజర్వ్‌లో ఉంచుతున్నామని, ఎవరైనా అనారోగ్యానికి గురైతే వారి స్థానంలో ఇతరులకు అవకాశం కల్పిస్తామని అధికారులు తెలిపారు.

స్కూల్స్, హాళ్లు బంద్:
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. రోజురోజుకి కరోనా కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్యా పెరుగుతోంది. మన దేశంలోనూ కరోనా కలకలం రేపుతోంది. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చారు. థియేటర్లు, మాల్స్, పబ్బులు, స్విమ్మింగ్ పూల్స్ మూసేశారు. ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

పరీక్షలు రాయనున్న 5లక్షల మంది విద్యార్థులు:
విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవులు ఇచ్చినా షెడ్యూల్ ప్రకారమే టెన్త్ పరీక్షలు జరుగుతాయని ఇదివరకే చెప్పారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంది. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్త పడింది. మార్చి 19 నుంచి ఏప్రిల్ 6 వరకు సుమారు 2వేల 530 కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. సుమారు 5లక్షల 34వేల 903 మంది విద్యార్థులు ఎగ్జామ్స్‌కు హాజరు కానున్నారు. పరీక్షల నిర్వహణలో 30వేల 500 మంది ఇన్విజిలేటర్లుగా బాధ్యతలు నిర్వర్తించనుండగా.. మాస్ కాపీయింగ్ జరగకుండా 144 సిట్టింగ్‌ స్క్వాడ్స్, 4 ఫ్లైయింగ్ స్క్వాడ్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

విద్యార్థులు పరీక్షలకు ఆత్మ విశ్వాసంతో సిద్ధం కావాలని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెప్పారు. అలాగే తల్లిదండ్రులు కూడా ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇక విద్యార్థులు గుంపులు, గుంపులుగా రావొద్దని.. ప్రొటెక్షన్ మాస్క్ వేసుకుంటే మంచిదని అధికారులు సూచించారు.

See Also | కరోనా పంజా : చార్మినార్, గోల్కొండ క్లోజ్