డిగ్రీ పాసైతే స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో ఉద్యోగాలు

  • Publish Date - November 5, 2019 / 05:18 AM IST

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్ధుల కోసం కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (CGL) ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ట్యాక్స్, సబ్ ఇన్‌స్పెక్టర్, జూనియర్ అకౌంటెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్ లాంటి గ్రూప్ బీ, గ్రూప్ సీ పోస్టుల్ని భర్తీ చేయనుంది.  

దరఖాస్తు ఫీజు:  
జనరల్ అభ్యర్ధులు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. SC, ST అభ్యర్ధులకు మాత్రం ఎలాంటి ఫీజు అవసరం లేదు.

ఎంపిక విధానం: 
రాత పరీక్ష ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. మొదటి దశలో పాసైనవాళ్లు రెండో దశ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్‌కు అర్హత సాధిస్తారు. 2020 జూన్ 22 నుంచి 2020 జూన్ 25 రెండో దశ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఇందులో క్వాలిఫై అయినవాళ్లు మూడో దశ డిస్క్రిప్టీవ్ పేపర్ రాయాలి. మూడో దశ పరీక్షలో పాసైనవారికి నాలుగో దశలో కంప్యూటర్ ప్రొఫీషియెన్సీ టెస్ట్, డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. 

దరఖాస్తు ప్రారంభం: అక్టోబర్ 22, 2019.

దరఖాస్తు చివరితేది: నవంబర్ 25, 2019. 

Read Also.. టెన్త్ పాసైతే చాలు: IOCL లో ఉద్యోగాలు