Ssc
సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF), నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA), సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (SSF), రైఫిల్ మ్యాన్ విభాగాల్లో గ్రౌండ్ డ్యూటీ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి ఫిబ్రవరి 11, 12 తేదీల్లో నిర్వహించనున్న పరీక్షల హాల్‌టికెట్లను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. పరీక్ష సమయం వరకు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అయితే కొన్ని కారణాల వల్ల కొందరి అభ్యర్థుల అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉంచలేదు. వారికి సంబంధించిన అడ్మిట్ కార్డులను ఫిబ్రవరి 8 నుంచి అందుబాటులో ఉంచనున్నారు. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్ టెస్టు (PET, PST) నిర్వహిస్తారు.
హాల్‌టికెట్ డౌన్‌లోడ్ ఇలా..
* అభ్యర్థులు తమకు సంబంధించిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రీజియన్ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వాలి.
* తర్వాత అక్కడ కనిపించే ” Download e-Admission Certificate” లింక్‌పై క్లిక్ చేయాలి.
* క్లిక్ చేయగానే అభ్యర్థి నమోదు చేయాల్సిన వివరాలతో కూడిన పేజీ ఓపెన్ అవుతుంది.
* రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టినతేదీ వివరాలను నమోదు చేసి ‘ Download e-Admission Certificate’ బటన్‌పై క్లిక్ చేయగానే హాల్‌టికెట్ వస్తుంది.
* హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకొని.. ప్రింట్ తీసుకోవాలి.
* పరీక్ష సమయంలో వీటిని తప్పకుండా తీసుకెళ్లాలి. హాల్‌టికెట్ లేకపోతే పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.