SBI క్లర్క్ ఉద్యోగాల దరఖాస్తు ప్రారంభం

  • Publish Date - January 3, 2020 / 06:15 AM IST

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సేల్స్ విభాగంలో జూనియర్ అసోసియేట్ (క్లర్క్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో మొత్తం 8వేలకు పైగా పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో రెగ్యులర్ పోస్టులు 7వేల 870 ఉండగా.. 134 బ్యాక్‌ లాగ్ పోస్టులు ఉన్నాయి. ఇక స్పెషల్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేసే పోస్టులు 130 ఉన్నాయి. 

ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు (జనవరి 3, 2019)న ప్రారంభమైంది. జనవరి 26 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. ప్రిలిమినరీ, మెయిన్, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

వయసు: 
అభ్యర్థులు జనవరి 1, 2020 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

పరీక్ష ఫీజు: 
దరఖాస్తు చేసుకోడానికి జనరల్, OBC అభ్యర్ధులు రూ. 750 చెల్లించాల్సి ఉంటుంది. SC, ST, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్ మెన్ అభ్యర్ధులకు మాత్రం ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

ముఖ్యతేదిలు:
> నోటిఫికేషన్ విడుదల: జనవరి 2, 2020.
దరఖాస్తు ప్రారంభం: జనవరి 3, 2020.
దరఖాస్తు చివరితేది: జనవరి 26, 2020.
మెయిన్ పరీక్ష తేది: ఏప్రిల్ 10, 2020.

Read Also.. హైదరాబాద్ లో సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ ఉద్యోగాలు