చెక్ ఇట్ : పాలిసెట్ 2020 ఎగ్జామ్ డేట్ రిలీజ్

  • Publish Date - December 29, 2019 / 03:01 AM IST

తెలంగాణలో పాలిసెట్ 2020 ఎగ్జామ్ డేట్స్ ను అధికారులు రిలీజ్ చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 17న పాలిసెట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ ఆధ్వర్యంలోని కమిటీ వెల్లడించింది.

పదోతరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పాలిసెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు 2020-21 విద్యాసంవత్సరానికి గానూ మూడేళ్ల పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులో చేరేందుకు పరీక్ష తేదీని ఖరారు చేశారు.

ఈ పరీక్ష మొత్తం 120 మార్కులకు నిర్వహించనున్నారు. OC, BC విద్యార్థులు కనీసం 36 మార్కులు సాధిస్తేనే వీరు కౌన్సెలింగ్‌కు అర్హత సాధిస్తారు. ఇక SC, ST అభ్యర్థులకు ఒక్కమార్కు వచ్చినా వారు అర్హత సాధించినట్లే.  

Read Also: ఐటీడీఏ పరిధిలో యువతకు ఉద్యోగ అవకాశాలు