10వ తరగతి సప్లిమెంటరీ షెడ్యూలు విడుదల

  • Publish Date - May 13, 2019 / 09:54 AM IST

తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి సోమవారం (మే 13, 2019)న  పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలును విడుదల చేశారు. మే 13న ఉదయం 11.30 గంటలకు పదోతరగతి పరీక్షల ఫలితాలను విడుదల చేసిన వెంటనే సప్లిమెంటరీ పరీక్షల తేదీలను కూడా ప్రకటించారు. మే 13న విడుదలైన పదోతరగతి ఫలితాల్లో మొత్తం 92.43 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో బాలికలు 93.68 శాతం ఉత్తీర్ణత సాధించగా బాలురు 91.18 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఈ ఏడాది మార్చి 16 నుంచి ఏప్రిల్ 3 వరకు నిర్వహించిన పదోతరగతి పరీక్షలకు మొత్తం 5.46 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.

షెడ్యూలు ప్రకారం జూన్ 10న సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమై.. జూన్ 24తో పూర్తి కానున్నాయి. ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు కొన్ని పరీక్షలు, మధ్యాహ్నం 12.45 గంటల వరకు కొన్ని పరీక్షలు జరగనున్నాయి.
 

ట్రెండింగ్ వార్తలు