TS Inter Results 2026: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఫేక్ వార్తలు నమ్మొద్దు.. ఫలితాలపై అధికారిక ప్రకటన..

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి గతేడాది వరకు జరిగిన ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల చేసిన తేదీలను ఈ సందర్భంగా ప్రకటించింది.

  • Published On : April 9, 2026 / 07:27 PM IST

TS Inter Results 2026: రిజల్ట్స్ కోసం ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఫలితాలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని విద్యార్థులతో పాటు వారి పేరెంట్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. అయితే, ఫలితాల తేదీ గురించి రోజుకో వార్త వస్తోంది. అంతేకాదు కావాలనే రిజల్ట్స్ విడుదల ఆలస్యం చేస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో గందరగోళం నెలకొంది.

దీంతో తెలంగాణ ప్రభుత్వ ఫ్యాక్ట్‌ చెక్‌ విభాగం అలర్ట్ అయ్యింది. ఈ వ్యవహారంపై స్పందించింది. ఇంటర్ విద్యార్థులను అప్రమత్తం చేసింది. రిజల్ట్స్ కు సంబంధించి ఫేక్ వార్తలు నమ్మొద్దని కోరింది. అంతేకాదు ఫలితాలపై అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ఇంటర్ ఫలితాలను కావాలనే లేట్ చేస్తున్నారనే ప్రచారాన్ని విద్యాశాఖ ఖండించింది. ఆ ప్రచారంలో నిజం లేదని తేల్చి చెప్పింది. ఇంటర్‌ రిజల్ట్స్ ప్రకటన షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతుందని స్పష్టం చేసింది. అంతేకాదు గతంలో ఎప్పుడూ కూడా ఏప్రిల్‌ ఫస్ట్ వీక్ లో ఇంటర్‌ ఫలితాలు విడుదల కాలేదన్న విషయాన్ని గుర్తు చేసింది విద్యాశాఖ. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి గతేడాది వరకు జరిగిన ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల చేసిన తేదీలను ఈ సందర్భంగా ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ఫ్యాక్ట్‌ చెక్‌ విభాగం సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

సంవత్సరం, తేదీల వారీగా ఇంటర్ ఫలితాలు వెల్లడైన వివరాలు..

2014- మే 3న ఫలితాలు విడుదల
2015- ఏప్రిల్ 22
2016- ఏప్రిల్ 22
2017- ఏప్రిల్ 16
2018- ఏప్రిల్ 13
2019- ఏప్రిల్ 18
2020- జూన్ 18 (కొవిడ్‌ కారణంగా అందరూ పాస్)
2021- జూన్ 28 (కొవిడ్‌ కారణంగా అందరూ పాస్‌)
2022- జూన్ 28
2023- మే 9
2024- ఏప్రిల్ 24
2025- ఏప్రిల్ 22న ఫలితాలు విడుదల

ఇంటర్ ఫలితాల వెల్లడి కొన్ని అంశాలపై ఆధారపడి ఉంటుందని విద్యాశాఖ తెలిపింది. ప్రతి సంవత్సరం ఒకే తేదీన ఫలితాలు వెల్లడించే అవకాశం ఉండదన్నారు. ఆన్సర్ పేపర్ల వ్యాలూయేషన్, ఇతర అంశాల ఆధారంగా రిజల్ట్స్ ప్రకటించే తేదీలు ప్రతి సంవత్సరం మారుతుంటాయని, ఈ విషయాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గ్రహించాలని సూచించారు. వ్యాలూయేషన్ పూర్తయ్యే సమయం ఆధారంగానే రిజల్ట్స్ విడుదల ఉంటుందన్నారు. ఇంటర్‌ రిజల్ట్స్ విషయంలో విద్యాశాఖ ఇచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే విద్యార్థులు, తల్లిదండ్రులు నమ్మాలని కోరారు. సోషల్ మీడియాలో ప్రచారం అయ్యే తప్పుడు వార్తలను అస్సలు నమ్మొద్దని తెలంగాణ విద్యాశాఖ విజ్ఞప్తి చేసింది.

Also Read: తెలంగాణ ప్రజలకు ఆరోగ్య శాఖ అలర్ట్.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి