×
Ad

Government Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. మొత్తం 10వేల పోస్టులు భర్తీ

రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయచ్చు. సిలబస్, పరీక్షా విధానం, ఎంపిక దశలకు సంబంధించిన ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో అందిస్తారు.

  • Published On : February 16, 2026 / 10:47 PM IST

Jobs Representative Image (Image Credit To Original Source)

  • గ్రామ పాలన అధికారుల నియామకం
  • గ్రామ స్థాయిలో పని చేయనున్న GPOలు
  • భూ రికార్డుల నిర్వహణ, రెవెన్యూ పరిపాలన, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు బాధ్యతలు

 

Government Jobs: తెలంగాణ ప్రభుత్వం గ్రామ పాలన అధికారి (GPO) పోస్టులు భర్తీ చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10వేల 954 ఖాళీలు ఉన్నాయి. అధికారిక పోర్టల్‌లో త్వరలో వివరణాత్మక నోటిఫికేషన్ విడుదల కానుంది. గ్రామ స్థాయి పరిపాలనను బలోపేతం చేసేందుకు, అలాగే ప్రజా సేవల పంపిణీని మెరుగుపరచే ప్రణాళికలో ఈ నియామకం భాగం.

రెవెన్యూ శాఖలో ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకున్న వారు ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అర్హత, వయోపరిమితి, దరఖాస్తు తేదీలు, ఎంపిక ప్రక్రియ గురించి వివరాలు అందులో ఉంటాయి. దరఖాస్తుదారులు అప్ డేట్స్ కోసం అధికారిక వెబ్‌సైట్‌ను తనిఖీ చేస్తూ ఉండాలని సూచించారు.

ఈ నియామకాలు తెలంగాణ రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో జరుగుతాయి. రాష్ట్రంలోని గ్రామాలలో 10వేల 954 మంది గ్రామ పాలనా అధికారులను నియమించాలని ప్రభుత్వం యోచిస్తోంది. గ్రామ స్థాయిలో GPOలు పనిచేస్తారు. భూ రికార్డుల నిర్వహణ, రెవెన్యూ పరిపాలన, ప్రభుత్వ సంక్షేమ పథకాలను సజావుగా అమలు చేయడంలో వారి సాయం తీసుకుంటారు.

ఇక సర్వే పనులు, జనాభా లెక్కల కార్యకలాపాలు, ప్రకృతి వైపరిత్యాలు, ఎన్నికల విధుల కోసం జిల్లా అధికారులు వారి సాయం తీసుకోవచ్చు. పెద్ద సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి. గ్రాడ్యుయేట్లకు ఇది మంచి అవకాశంగా భావిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పాలనను మెరుగుపరచడం, ప్రజా సేవలను వేగవంతం చేయడం కూడా ఈ పోస్టుల భర్తీ వెనకున్న లక్ష్యం.

త్వరలో నోటిఫికేషన్, దరఖాస్తు వివరాలు..

అధికారిక నోటిఫికేషన్ విడుదలకు కచ్చితమైన తేదీని ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు. దరఖాస్తు ప్రారంభ తేదీ, దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ , పరీక్ష షెడ్యూల్ త్వరలో ప్రకటిస్తారు.

రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయచ్చు. వివరణాత్మక సిలబస్, పరీక్షా విధానం, ఎంపిక దశలకు సంబంధించిన ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో అందిస్తారు. అభ్యర్థులు మరిన్ని అప్ డేట్స్ కోసం అధికారిక వెబ్‌సైట్‌ను చెక్ చేస్తూ ఉండడాలి. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయ్యే అవకాశాలను పెంచుకోవడానికి ప్రిపరేషన్ మొదలు పెట్టడం మంచిది.

Also Read: రేపే సూర్యగ్రహణం.. ఎప్పుడు ప్రారంభం అవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది, సూతక కాలం ఎప్పుడు, భారత్ లో కనిపిస్తుందా? పూర్తి వివరాలు