Telangana Inter : ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఫస్ట్ ఇయర్‌లోనూ ఇంటర్నల్ మార్కులు!
Telangana Inter : 2026–27 నుంచి తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో కొత్త మూల్యాంకన విధానం అమలు చేయనుంది. 20 శాతం ఇంటర్నల్ మార్కులు, 80 శాతం థియరీ మార్కులతో కొత్త విధానాన్ని ఇంటర్ బోర్డు అందుబాటులోకి తీసుకురానుంది.
- Sreehari A
- Published on- October 1, 2026 / 07:30 PM IST
Telangana Inter First Year
ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో కొత్త రూల్..
ఇంటర్నల్ మార్కుల విధానం అమల్లోకి
విద్యార్థులు తప్పక తెలుసుకోవాల్సిన విషయం
Telangana Inter : తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు కీలక అప్‌డేట్. 2026–27 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు కొత్త మూల్యాంకన విధానం అమల్లోకి రానుంది. ఇందులో భాగంగా ఫస్ట్ ఇయర్‌లోనూ ఇంటర్నల్ అసెస్మెంట్‌కు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
విద్యార్థుల్లో కేవలం పుస్తక పరిజ్ఞానాన్ని పెంచడం కాకుండా విమర్శనాత్మక ఆలోచన, ప్రాబ్లమ్ సాల్వింగ్, క్రియేటివిటీ, ప్రాక్టికల్ నాలెడ్జ్ వంటి (Telangana Inter) స్కిల్స్ డెవలప్ చేయడమే ఈ మార్పుల ప్రధాన ఉద్దేశంగా ఇంటర్ బోర్డు పేర్కొంది.
కొత్త విధానమిదే :
కొత్త విధానం ప్రకారం.. ఫస్ట్ ఇయర్ పరీక్షల్లో మొత్తం మార్కుల్లో 20 శాతం ఇంటర్నల్ అసెస్మెంట్‌కు కేటాయించనున్నారు. మిగిలిన 80 శాతం మార్కులు థియరీ పరీక్షల ద్వారా విద్యార్థులకు లభిస్తాయి. ఈ విధానాన్ని అన్ని కాలేజీలు పారదర్శకంగా, ఒకే విధమైన ప్రమాణాలతో అమలు చేసేందుకు తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి కామన్ వాలిడేషన్ రూల్స్‌ను రూపొందించింది.
Read Also : Telangana SIR : తెలంగాణ SIRకు మరోసారి గడువు పొడిగింపు లేదు : సీఈవో సుదర్శన్‌రెడ్డి
ఇంటర్నల్ అసెస్మెంట్‌కు సంబంధించిన విధివిధానాలు, మార్కుల కేటాయింపు, మూల్యాంకన ప్రక్రియపై కాలేజీలకు బోర్డు సర్క్యులర్ జారీ చేసింది. విద్యార్థులు, అధ్యాపకులకు ఎదురయ్యే సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రశ్నలు, సమాధానాలతో కూడిన సమాచారాన్ని కూడా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలిపింది.
ప్రయోగాత్మక అభ్యాసానికి ప్రాధాన్యత ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది. తద్వారా విద్యార్థుల్లో నిరంతర అభ్యాసాన్ని పెంపొందించడమే కాకుండా భవిష్యత్తులో ఎదురయ్యే విద్యా, వృత్తిపరమైన సవాళ్లను కూడా విద్యార్థులు ఎదుర్కొనేలా వారిని సిద్ధం చేయాలని బోర్డు భావిస్తోంది. ఈ కొత్త నిబంధనలు 2026–27 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానున్నాయి.
