Telangana SIR : తెలంగాణ SIRకు మరోసారి గడువు పొడిగింపు లేదు : సీఈవో సుదర్శన్‌రెడ్డి
Telangana SIR : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ గడువును మరోసారి పొడిగించే ఉద్దేశం లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి అన్నారు.
Telangana SIR
- నవబంర్ 5వ తేదీ వరకు సర్ ప్రక్రియ ఉంటుంది
- ఖైరతాబాద్ నియోజకవర్గంలో 80 వేల మందికి నోటీసులు
- ఆ రాష్ట్రాలకు మాత్రమే ఫారమ్-6కు డిక్లరేషన్ మినహాయింపు
Telangana SIR : తెలంగాణలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ గడువును మరోసారి పొడిగించే ఉద్దేశం లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే ఒకసారి గడువు పొడిగించినందున, ప్రస్తుతం నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సర్ ప్రక్రియను పూర్తి చేయాలన్నదే ఎన్నికల సంఘం ఉద్దేశమని చెప్పారు.
తుది జాబితాలో 54 లక్షల మంది :
సర్ ప్రక్రియలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 92 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయగా, ఇప్పటివరకు 65 లక్షల మంది నోటీసులకు సమాధానం ఇచ్చినట్లు సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు. వీరిలో 54 లక్షల మందిని ఫైనల్ ఓటరు లిస్టులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. నవంబర్ 5లోగా మిగిలిన ఓటర్లకు సంబంధించిన ప్రాసెస్ కంప్లీట్ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.
ఇకపై హియరింగ్ ప్రాసెస్ ఉండదని, దాని స్థానంలో అవసరమైన డాక్యుమెంట్లను సేకరించే ప్రాసెస్ కొనసాగుతుందని సీఈవో తెలిపారు. నోటీసులు అందుకున్న వారి ఇళ్లకే బూత్ లెవల్ అధికారులు (BLOs) వెళ్లి సంబంధిత డాక్యుమెంట్లు సేకరించాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు.
Read Also : KTR-Revanth Reddy : మీ ఆస్తులు.. మా ఆస్తులు.. సిట్టింగ్ జడ్జితో తేల్చేద్దామా? రేవంత్‌కు కేటీఆర్ సవాల్
40శాతం మంది ఫైనల్ లిస్టులోకి :
ఒక కుటుంబంలోని ప్రతి సభ్యుడు తప్పనిసరిగా అందుబాటులో ఉండాల్సిన అవసరం లేదని, కుటుంబంలో ఒక్కరు మిగిలిన సభ్యుల వివరాలు అందిస్తే సరిపోతుందని స్పష్టం చేశారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో 80 వేల మందికి నోటీసులు ఇచ్చామని, నోటీసులు అందుకున్న వారిలో 40 శాతం మందిని ఇప్పటికే తుది ఓటరు జాబితాలోకి చేర్చినట్లు తెలిపారు.
వలస వెళ్లిన ఓటర్లను ఆఫీసులకు పిలవాల్సిన అవసరం లేదని, ఈఆర్వోలు ఆన్లైన్లోనే వారిని సంప్రదించి ప్రక్రియను పూర్తి చేస్తారని చెప్పారు. తెలంగాణలో సర్ ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నందున ఫారమ్-6కు డిక్లరేషన్ తప్పనిసరిగా ఉంటుందని స్పష్టం చేశారు.
ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం.. క్లెయిమ్‌లు, అభ్యంతరాల దాఖలుకు అక్టోబర్ 7 వరకు గడువు ఉంది. నోటీసుల జారీ, అభ్యంతరాల పరిష్కార ప్రక్రియ నవంబర్ 5 వరకు కొనసాగుతుంది. ఫైనల్ ఓటరు లిస్టును నవంబర్ 9న విడుదల చేయనున్నట్టు సీఈఓ సుదర్శన్‌రెడ్డి తెలిపారు.
