నిరుద్యోగులు శుభవార్త.. ఉద్యోగాల కోసం కంపెనీల చుట్టూ తిరిగితే సమయం వృథా అవుతుందా? ఇక నుంచి మీకు ఆ బాధలు తగ్గుతాయి. ఇప్పుడు ఉద్యోగాల కోసం ప్రయత్నించడం చాలా సులభం కానుంది. ఎందుకంటే.. నిరుద్యోగుల కోసం డిపార్ట్ మెంట్ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ కొత్త టెక్నాలజీ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఓ ప్రైవేటు సంస్థ సహకారంతో ప్రత్యేకంగా మొబైల్ యాప్, వెబ్‌పేజీ తెరిచింది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న అభ్యర్ధులు ఈ యాప్ లేదా వెబ్ పేజీలో వివరాల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది.
వివరాలు.. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి సోమవారం (ఆగస్ట్ 26, 2019)న సచివాలయంలో… ప్రైవేట్ ఉద్కోగాల కోసం వెతుకుతున్న అభ్యర్ధులు తమ అర్హతలు తగ్గ ఉద్యోగాలను వెతుక్కోవడానికి డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్‌ఛేంజ్ ఆఫ్ తెలంగాణ (DEET) అనే యాప్, వెబ్‌సైట్ ప్రారంభించారు. ఈ యాప్ కోసం ప్రభుత్వం ఏటా రూ.10 లక్షలు ఖర్చు చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, కార్మిక ఉపాధి కల్పన డైరెక్టర్ కేవై నాయక్, మోహిత్‌కుమార్ కూడా పాల్గొన్నారు.
యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన విధానం..
గూగుల్ ప్లేస్టోర్‌లో డీట్ (DEET) అని సెర్చ్ చేస్తే డిజిటల్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్చేంజ్ ఆఫ్ తెలంగాణ అనే యాప్ కనపడుతోంది. దాన్నీ ఇన్‌స్టాల్ చేసుకుని వివరాలు నమోదు చేసుకున్న తర్వాత ఉద్యోగావకాశాలు కనపడతాయి. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వారికి ప్రైవేట్ కంపెనీలే ఉద్యోగల కోసం నోటిఫికేషన్స్ పంపిస్తారు.
> ఈ యాప్ లో జాబ్ సెర్చ్ చేయడం చాలా సింపుల్. మొదట డీట్ యాప్‌లో మీ పేరు, విద్యార్హతల వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి. మీ అర్హతలకు తగిన ఉద్యోగాలు ఉంటే వెంటనే తెలిసిపోతుంది. లేదా భవిష్యత్తులో ఎప్పుడైనా ఎంప్లాయర్స్ ఎవరైనా డీట్ ప్లాట్‌ఫామ్‌లో జాబ్ నోటిఫికేషన్ అప్‌లోడ్ చేస్తే… ఆ ఉద్యోగాలకు మీకు తగిన అర్హతలు ఉన్నట్టైతే వెంటనే మీ మెయిల్ కు మెసేజ్ వస్తుంది. ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్నవాళ్లు కూడా ఇందులో రిజిస్టర్ చేసుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం DEET యాప్ ద్వారా ఈ సేవలన్నింటినీ ఉచితంగానే అందిస్తోంది.