TS LAWCET Counselling : తెలంగాణలో ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్ఎం ప్ర‌వేశాల షెడ్యూల్ ఖ‌రారు

తెలంగాణ రాష్ట్రంలో ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖ‌రారైంది. న‌వంబ‌ర్ 2వ తేదీ నుంచి 12 వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ధ్రువ‌ప‌త్రాల‌ను ప‌రిశీలించ‌నున్నారు.

TS LAWCET Counselling

TS LAWCET Counselling : తెలంగాణ రాష్ట్రంలో ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖ‌రారైంది. న‌వంబ‌ర్ 2వ తేదీ నుంచి 12 వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ధ్రువ‌ప‌త్రాల‌ను ప‌రిశీలించ‌నున్నారు. న‌వంబ‌ర్ 18, 19వ తేదీల్లో లాసెట్, పీజీఎల్ సెట్ వెబ్ ఆప్ష‌న్లు న‌మోదు చేసుకోవ‌చ్చు.

AP Entrance Test : ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్.. పరీక్షలు ఎప్పటినుంచంటే?

న‌వంబ‌ర్ 22న ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్ఎం సీట్ల‌ను కేటాయించ‌నున్నారు. న‌వంబ‌ర్ 28 నుంచి ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్ఎం త‌ర‌గ‌తులు ప్రారంభంకానున్నాయి. త‌దిత‌ర వివ‌రాల కోసం lawcet.tsche.ac.in అనే వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు.