AP Entrance Test : ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్.. పరీక్షలు ఎప్పటినుంచంటే?

AP Entrance Test : ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ (AP Common Entrance Exam Schedule)ను రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది.

AP Entrance Test : ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్.. పరీక్షలు ఎప్పటినుంచంటే?

Ap Entrance Test Ap Common Entrance Exam Schedule 2022 Released

AP Entrance Test : ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ (AP Common Entrance Exam Schedule)ను రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహించనుంది. ఏపీ ఈఏపీసెట్‌ను జూలైలో ప్రభుత్వం నిర్వహించనుంది. 2022-23 విద్యా సంవత్సరానికిగానూ ఏపీ ఈఏపీసెట్‌ను జూలై 4 నుంచి జూలై 12 వరకు నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. అంతేకాదు.. ఎడ్ సెట్, లాసెట్, ఐసెట్, పీజీసెట్, ఈసెట్‌లను కూడా జూలైలో నిర్వహించాలని నిర్ణయించింది. 9 రోజుల పాటు ఈ ఏపీ EAPCET పరీక్షలను నిర్వహించనున్నారు.

ఈ పరీక్షల్లో వచ్చిన ర్యాంకుల ఆధారంగానే అభ్యర్థులకు రాష్ట్రంలోని పలు ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో సీట్లను కేటాయిస్తారు. మరోవైపు బీఎడ్ కోర్సుల్లో ప్రవేశానికి కూడా Ed- CET -2022ను జూలై 13న నిర్వహించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం లాసెట్, పీజీఎల్ సెట్ కూడా నిర్వహించనున్నారు. పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాల కోసం PGECET-2022ను జూలై 18 నుంచి జూలై 21వరకు నిర్వహించనున్నారు. ఇక డిప్లోమా విద్యార్థుల కోసం ఈసెట్ జూలై 22న, MBA, MCA కోర్సుల్లో ప్రవేశం కోసం ICET 2022 పరీక్షను జూలై 25న నిర్వహించనున్నారు.

Ap Entrance Test Ap Common Entrance Exam Schedule 2022 Released (1)

Ap Entrance Test Ap Common Entrance Exam Schedule 2022 Released 

2022 మార్చి 23న ఏపీ EAPCET ప్రవేశ పరీక్షలకు సంబంధించి షెడ్యూల్ ను ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. 2022లో జూలై 4 నుండి 8వ తేదీ వరకు ఇంజనీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. జూలై 11,12 తేదీల్లో అగ్రికల్చరల్ పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 134 సెంటర్లలో ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తారు.

తెలంగాణలో కూడా 4 పరీక్షా కేంద్రాల్లో ఉమ్మడి ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి 2022 ఏప్రిల్ 11న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంసెట్ ప్రవేశ పరీక్షలను విడుదల చేసింది. ఐఐటీ జేఇఇ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఆధారంగా 2 తెలుగు రాష్ట్రాలు తమ రాష్ట్రాల్లో ఎంసెట్ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. IIT, JEE ప్రవేశ పరీక్షల షెడ్యూల్స్ మార్పులు చేసింది.

Read Also : ECIL : ఈసీఐఎల్ హైదరాబాద్ లో ఖాళీల భర్తీ