ECIL : ఈసీఐఎల్ హైదరాబాద్ లో ఖాళీల భర్తీ

సైంటిఫిక్ అసిస్టెంట్‌ పోస్టుకు సంబంధించి ఎలక్ట్రానిక్స్ లో ఫస్ట్-క్లాస్ డిప్లొమా చేసి ఉండాలి. కమ్యూనికేషన్ , ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ , ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ కనీసం స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్

ECIL : ఈసీఐఎల్ హైదరాబాద్ లో ఖాళీల భర్తీ

Ecil

ECIL : భారత ప్రభుత్వ రంగ సంస్ధ ఎలక్ట్రానిక్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ హైదరాబాద్ లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిపికేషన్ ద్వారా వివిధ విభాగాల్లో 8 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల వివరాలకు సంబంధించి టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు 3 ఖాళీలు, టెక్నికల్ అసిస్టెంట్ 4ఖాళీలు, సైంటిఫిక్ అసిస్టెంట్ 4ఖాళీలు, జూనియర్ ఆర్టిజన్ 1 ఖాళీ భర్తీ చేయనున్నారు.

ఇక విద్యార్హతల విషయానికి వస్తే టెన్నికల్ ఆఫీసర్ పోస్టుకు గుర్తింపు పొందిన యూనివర్శిటీలో కంప్యూటర్ సైన్స్ లో ఫస్ట్ క్లాస్ ఇంజనీరింగ్ డిగ్రీ చేసి ఉండాలి. కనీసం 60శాతం మార్కులు సాధించాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుకు సంబంధించి అభ్యర్ధులు ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ లో ఫస్ట్ క్లాస్ డిప్లోమా లేదంటే ఎలక్ట్రికల్ మరియు ఎలక్టానిక్స్ , ఎలక్ట్రానిక్స్ ఇన్ స్టుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ గుర్తింపు పొందిన ఏదైనా సంస్ధ నుండి కనీసం 60శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. లేదంటే మ్యాథ‌మెటిక్స్‌, ఫిజిక్స్‌, కంప్యూట‌ర్ సైన్స్‌లో బీఎస్సీ చేసి ఉండాలి.

సైంటిఫిక్ అసిస్టెంట్‌ పోస్టుకు సంబంధించి ఎలక్ట్రానిక్స్ లో ఫస్ట్-క్లాస్ డిప్లొమా చేసి ఉండాలి. కమ్యూనికేషన్ , ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ , ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ కనీసం స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ద్వారా గుర్తింపు పొందిన ఏదైనా సంస్థ నుండి మొత్తం 60శాతం మార్కులు సాధించి ఉండాలి. జూనియ‌ర్ ఆర్టిజ‌న్‌ పోస్టుకు సంబంధించి ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ,ట్రేడ్‌లలో ఐటిఐ ఉత్తీర్ణులై ఉండాలి. టెస్టింగ్ రంగంలో కనీసం ఒక సంవత్సరం పోస్ట్ అర్హత అనుభవంతో ఇన్‌స్ట్రుమెంటేషన్ ,రేడియేషన్ డిటెక్షన్ సిస్టమ్స్ , న్యూమాటిక్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంట్స్, ఎలక్ట్రానిక్స్ నిర్వహణవ్యవస్థలపై అవ‌గాహ‌న కలిగి ఉండాలి.

మెరిట్‌, సామ‌ర్థ్యం, అనుభ‌వం ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్థులు నోటిఫికేష‌న్ ఆధారంగా అవ‌స‌ర‌మైన డాక్యుమెంట్ల‌తో ఇంట‌ర్వ్యూకు రావాలి. ఇంటర్య్వూ హైదరాబాద్ ఈసీఐల్ జోనల్ కార్యాలయంలో నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ తేదీ ఫిబ్రవరి 25, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ https://www.ecil.co.in/jobs.html