తెలంగాణలో ఇంటర్ ఫలితాలు త్వరలోనే విడుదల కానున్నాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకెండ్ ఇయర్ పరీక్ష ఫలితాలను ఏప్రిల్ 8న విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అభ్యర్థులు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు. గతేడాది ఇంటర్ పరీక్ష ఫలితాలను ఏప్రిల్ 13న విడుదల చేసిన సంగతి తెలిసిందే.
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలకు మే 30 వరకు వేసవి సెలవులు ఉంటాయి. సెలవులు ముగిసిన తర్వాత జూన్ 1 నుంచి 2019-20 విద్యా సంవత్సరానికి తరగతులు ప్రారంభంకానున్నాయి.
ఏపీలో ఏప్రిల్ 12న ఇంటర్ ఫలితాలు?
అంధ్రప్రదేశ్ లో ఇటర్మీడియట్ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 12న విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. షెడ్యూల్ ప్రకారం పేపర్ కరెక్షన్ పూర్తయితే ఏప్రిల్ 12న ఫలితాలు విడుదల చేయడానికి ఇంటర్ బోర్డు సన్నాహాలు చేస్తోంది. ఏపీలో జూన్ 2 వరకు వేసవి సెలవులు కొనసాగనున్నాయి. జూన్ 3న కళాశాలలు తిరిగి తెరచుకోనున్నాయి.