TG ECET 2026 Results: TG ఈసెట్ ఫలితాలు విడుదల..

జూలై మొదటి వారం తరగతులు ప్రారంభం అవుతాయి. ఫీజులు గత ఏడాది మాదిరిగానే ఉంటాయి. త్వరలోనే కౌన్సిలింగ్ షెడ్యూల్..

  • Updated on- May 29, 2026 / 05:54 PM IST

TG ECET 2026 Results: TG ECET-2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణ రెడ్డి రిజల్ట్స్ రిలీజ్ చేశారు. 16వేల 726 (93.60 శాతం) మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్ తో అధికారిక వెబ్‌సైట్ (https://ecet.tgche.ac.in/)లో ర్యాంక్ కార్డ్ ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో లాటరల్ ఎంట్రీ (నేరుగా సెకండియర్) ప్రవేశాల కోసం తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG ECET) నిర్వహించారు. జేఎన్‌టీయూ హైదరాబాద్ అధికారులు ఫలితాలను, అభ్యర్థుల ర్యాంక్ కార్డులను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

కెమికల్ ఇంజనీరింగ్ లో రూపానీ నరేంద్ర మొదటి ర్యాంక్ సాధించారు. సివిల్ ఇంజనీరింగ్ లో కండ్లపెల్లి సంతోష్ మొదటి ర్యాంక్, కంప్యూటర్ సైన్స్ లో అస్మిత మొదటి ర్యాంక్ సాధించారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లో ఆకుల విష్ణుమూర్తి, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో బన్నీ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ లో గుణ సాయి గణేష్, మెకానికల్ ఇంజనీరింగ్ లో నికిల్ కుమార్, మెటలర్జీకల్ ఇంజనీరింగ్ లో పునీత్, మైనింగ్ ఇంజనీరింగ్ లో సామల మహేశ్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. మే 15న టీజీ ఈసెట్ 2026 పరీక్ష జరిగింది. 18 వేల 626 మంది అప్లయ్ చేసుకోగా.. 17,870 మంది పరీక్ష రాశారు.

16వేల 726 మంది క్వాలిఫై..

”16వేల 726 (93.60 శాతం) మంది క్వాలిఫై అయ్యారు. జూలై మొదటి వారం తరగతులు ప్రారంభం అవుతాయి. 179 కాలేజీలు ఉన్నాయి. 21,200 (50 శాతం) సీట్స్ ఫిలప్ అయ్యాయి. ఫీజులు గత ఏడాది మాదిరిగానే ఉంటాయి. త్వరలోనే కౌన్సిలింగ్ షెడ్యూల్ ఇస్తాం” అని అధికారులు తెలిపారు.

తెలంగాణ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌కు హాజరైన అభ్యర్థులు ఇప్పుడు అధికారిక పరీక్షా పోర్టల్ ద్వారా తమ స్కోర్లు, ర్యాంకులు, అర్హత స్థితిని చెక్ చేసుకోవచ్చు. లాటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్, బీఫార్మసీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశం లక్ష్యంగా పెట్టుకున్న డిప్లొమా హోల్డర్లు, బీఎస్సీ మ్యాథమెటిక్స్ అభ్యర్థుల కోసం ఈ పరీక్ష నిర్వహించబడుతుంది.

TG ECET 2026 ర్యాంక్ కార్డులు అధికారిక పరీక్షా వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చాయి. ఫలితాల పేజీని యాక్సెస్ చేయడానికి అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీని ఉపయోగించాలి. పరీక్షలో ర్యాంకుకు అర్హత సాధించడానికి అభ్యర్థులు కనీసం 25 శాతం మొత్తం మార్కులు పొందాల్సి ఉంటుంది. అంటే, అర్హత ప్రమాణాలను అందుకోవడానికి దరఖాస్తుదారులు 200 మార్కులకు కనీసం 50 మార్కులు పొందాలి.

ర్యాంక్ కార్డును ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..
* టీజీ ఈసెట్ అధికారిక వెబ్‌సైట్ https://ecet.tgche.ac.in/ ను సందర్శించాలి.
* హోమ్ పేజీలో కనిపించే ‘Download Rank Card‘ లింక్‌పై క్లిక్ చేయాలి.
* అభ్యర్థి తన ఈసెట్ హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయాలి.
* వివరాలన్నీ సరి చూసుకుని ‘View Rank Card’ పై క్లిక్ చేయగానే ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
* కౌన్సెలింగ్, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కోసం ఈ ర్యాంక్ కార్డును ప్రింటౌట్ తీసుకోవాలి.

ర్యాంక్ కార్డు డౌన్ లోడ్ కోసం క్లిక్ చేయండి..

Also Read: జూన్ 1 నుంచి కొత్త ఫైనాన్షియల్ రూల్స్.. UPI, ATM, LPG ధరల్లో భారీ మార్పులు.. సామాన్యుడి జేబుకు చిల్లే!