Bank of Baroda Recruitment : బరోడా బ్యాంకులో జాబ్స్ పడ్డాయ్.. డిగ్రీ పాసైతే చాలు.. నెలకు రూ.93,960 వరకు జీతం
Bank of Baroda Recruitment 2026 : బ్యాంకులో ఉద్యోగం కావాలా? ఈ బ్యాంకులో 1,100 రెగ్యులర్ పోస్టులు ఖాళీగా ఉండగా భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించింది. వెల్త్ ఎగ్జిక్యూటివ్, క్రెడిట్ అనలిస్ట్ పోస్టులకు సెప్టెంబర్ 24 వరకు అప్లయ్ చేసుకోవచ్చు.
Bank of Baroda Recruitment 2026
- బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా?
- బరోడా బ్యాంకులో 1,100 పోస్టులు, సెప్టెంబర్ 24 చివరి గడువు
- డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఉద్యోగం.. నెలకు రూ.93,960 వరకు జీతం
- వెల్త్ ఎగ్జిక్యూటివ్, క్రెడిట్ అనలిస్ట్ పోస్టులు, వెంటనే అప్లై చేయండి
Bank of Baroda Recruitment 2026 : బ్యాంకు జాబ్ కోసం చూస్తున్నారా? బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్ పడ్డాయి. ఈ బ్యాంకులోని వివిధ విభాగాల్లో మొత్తం 1,100 రెగ్యులర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. అర్హత ఉన్న అభ్యర్థులు 2026 సెప్టెంబర్ 24 వరకు ఆన్లైన్లో అప్లయ్ చేసుకోవచ్చు. పోస్టును బట్టి నెలకు రూ.48,480 నుంచి రూ.93,960 వరకు జీతం పొందవచ్చు.
ఈ నియామకంలో ప్రధానంగా 2 రకాల పోస్టులు ఉన్నాయి. వెల్త్ ఎగ్జిక్యూటివ్ (JMG/S-I)కు 1,000 పోస్టులు, క్రెడిట్ అనలిస్ట్ (MMG/S-II)కు 100 పోస్టులు ఉన్నాయి. వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్, కార్పొరేట్ అండ్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనుంది.
విద్యార్హతలివే :
వెల్త్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. సంబంధిత సర్టిఫికేషన్‌తో పాటు వెల్త్ ప్రొడక్ట్స్ సేల్స్ విభాగంలోనూ కనీసం రెండేళ్ల అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
క్రెడిట్ అనలిస్ట్ పోస్టులకు గ్రాడ్యుయేషన్ మాత్రమే కాదు.. మేనేజ్మెంట్లో రెండేళ్ల ఫుల్‌టైమ్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిగ్రీ, డిప్లొమా, MBA ఏదొకటి చేసి ఉండాలి.
ఫైనాన్స్, మార్కెటింగ్, బ్యాంకింగ్ స్పెషలైజేషన్ ఉన్నవారు ఈ పోస్టుకు అర్హులు. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులో కనీసం ఏడాది బ్యాంకింగ్ ఎక్స్ పీరియన్స్ మస్ట్. సీఏ అర్హత, కార్పొరేట్ క్రెడిట్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారికి ఎక్కువ ప్రాయారిటీ ఉంటుంది.
వయోపరిమితి, ఫీజు ఎంతంటే? :
2026 సెప్టెంబర్ 1 నాటికి అభ్యర్థుల వయసు 21 ఏళ్ల వయస్సు నుంచి 33 ఏళ్ల వయస్సు మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది. జనరల్, EWS, OBC అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.850 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు రూ.175 చెల్లించాల్సి ఉంటుంది. పరీక్ష ఫీజు చెల్లించే విధానంలో పేమెంట్ గేట్‌వే ఛార్జీలు, జీఎస్టీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
ఎంపిక, పరీక్ష విధానం :
దరఖాస్తు, స్క్రీనింగ్ అనంతరం ఆన్లైన్ రాత పరీక్ష నిర్వహించనున్నారు. అవసరాన్ని బట్టి సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్ లేదా పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఉండొచ్చు. రాత పరీక్షలో 120 ప్రశ్నలు, 120 మార్కులు ఉంటాయి.
ఇంగ్లీష్, రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్, బ్యాంకింగ్ అవేర్నెస్, ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచి ప్రశ్నలు వస్తాయి. వెల్త్ ఎగ్జిక్యూటివ్‌కు రూ.48,480 నుంచి రూ.85,920, క్రెడిట్ అనలిస్ట్‌కు రూ.64,820 నుంచి రూ.93,960 వరకు నెలవారీ వేతనం అందనుంది. దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ 24, 2026 వరకు మాత్రమే సమయం ఉంది.
