Railway Recruitment 2026 : రైల్వేలో జాబ్స్ పడ్డాయ్.. 1,599 అప్రెంటిస్ పోస్టులు.. నో ఎగ్జామ్, పది పాసైతే చాలు..!
Railway Recruitment 2026 : ఈస్ట్ కోస్ట్ రైల్వే 2026లో మొత్తం 1,599 అప్రెంటిస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 10వ తరగతి, ITI అర్హతతో రాత పరీక్ష లేకుండానే ఎంపిక చేయనున్నారు. ఆగస్టు 26 నుంచి అర్హులు అప్లయ్ చేసుకోవచ్చు.
Railway Apprentice Jobs
- టెన్త్ మార్కులే చాలు.. రైల్వేలో 1,599 ఉద్యోగాలు
- రాత పరీక్ష లేదు.. ఈస్ట్ కోస్ట్ రైల్వేలో భారీ అప్రెంటిస్ నోటిఫికేషన్
- యువతకు రైల్వే గుడ్ న్యూస్.. ఆగస్టు 26 నుంచే దరఖాస్తు
Railway Recruitment 2026 : రైల్వేలో జాబ్స్ పడ్డాయి.. రైల్వేలో ఉద్యోగం చూసేవారికి లక్కీ ఛాన్స్.. మీరు 10వ తరగతి పాస్ అయి ఉంటే చాలు.. మీ మార్కుల ఆధారంగా ఎలాంటి రాత పరీక్ష లేకుండానే జాబ్ పట్టేయొచ్చు.
రైల్వే నోటిఫికేషన్ ప్రకారం.. ఈస్ట్ కోస్ట్ రైల్వేలో ట్రైనింగ్, కెరీర్‌కు కోసం అప్రెంటిస్ పోస్టులకు సంబంధించి ఈస్ట్ కోస్ట్ రైల్వే (ECoR) నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 2026-27 సంవత్సరానికి ఈ రైల్వేలో అనేక డివిజన్లు, వర్క్‌షాప్‌లలో మొత్తం 1,599 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలు ఉన్నాయి. వీటిని భర్తీ చేసే దిశగా రైల్వే చర్యలు చేపట్టింది.
అయితే, అర్హత గల అభ్యర్థులు ఆగస్టు 26, 2026 నుంచి సెప్టెంబర్ 15, 2026 వరకు ఆన్లైన్లో అప్లయ్ చేసుకునే అవకాశం ఉంది. ఇందులో వెల్డర్, ఫిట్టర్, మెషినిస్ట్, టర్నర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, పెయింటర్, వైర్మన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, COPA, రిఫ్రిజరేషన్ అండ్ ఏసీ మెకానిక్ వంటి ట్రేడుల్లో అవకాశాలను పొందవచ్చు.
ఆసక్తిగల అభ్యర్థులు ఐటీఐ అర్హత, టెన్త్‌లో కనీసం 50 శాతం మార్కులు తెచ్చుకుని ఉండాలి. 2026 సెప్టెంబర్ 15 నాటికి వయసు 15ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం.. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోసడలింపు కూడా ఉంటుంది.
ఈ పోస్టులకు సంబంధించి ఎలాంటి రాత పరీక్ష ఉండదు.కేవలం 10వ తరగతి మార్కుల ఆధారంగానే ఎంపిక విధానం ఉంటుంది. దీనికి సంబంధించి మెరిట్ లిస్టును రెడీ చేసి ఆ తర్వాతే అర్హులను ఎంపిక చేస్తారు. జనరల్ అభ్యర్థులకు మాత్రం దరఖాస్తు ఫీజు రూ.100 ఉంటుంది. అదే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులకు మాత్రం ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
అప్లికేషన్ ప్రాసెస్ తర్వాత మీ దరఖాస్తు కాపీని ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం జాగ్రత్తగా దాచుకోవాలి. సెలెక్షన్ ప్రాసెస్ సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు అధికారిక నోటిఫికేషన్ ఓసారి చూడండి..
