The application process for SBI clerk posts will end on August 26
SBI Clerk Posts: బ్యాంకింగ్ రంగంలో సెటిల్ అవ్వాలనుకుటనున్నారా? అయితే ఈ అద్భుతమైన అవకాశం మీకోసమే. ప్రముఖ బ్యాంకింగ్ రంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 6589 క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే(SBI Clerk Posts). దీనికి సంబందించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలవగా ఆగస్టు 26వ తేదీతో ముగియనుంది. కాబట్టి, అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://sbi.co.in/web/careers ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యార్హత:
అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పూర్తి చేసి ఉండాలి.
డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 20 ఏళ్ల నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం, SC/ST, OBC, PWD అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
స్థానిక భాషా పరిజ్ఞానం:
అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న రాష్ట్రంలోని స్థానిక భాషలో చదవడం, రాయడం, మాట్లాడటం వచ్చి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ:
ఎస్బీఐ క్లర్క్ పోస్టు నియామక ప్రక్రియ రెండు ప్రధాన దశల్లో జరుగుతుంది. మొదటిది ప్రిలిమినరీ పరీక్ష. రెండవది మెయిన్స్ పరీక్ష. వీటిలో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. దానికన్నా ముందు అభ్యర్థులు స్థానిక భాషా పరీక్షలో అర్హత సాధించాల్సి ఉంటుంది.