Job Opportunities : టెక్నాలజీ, సేవలు, ఉత్పత్తి రంగంలో టాప్ 5 ఉద్యోగ అవకాశాలు ఇవే!

ప్రస్తుతం మాలిక్యులర్ బయాలజిస్టు ఉద్యోగాలకు మంచి అవకాశాలు ఉన్నాయి. మనుషుల, జంతువులు, మొక్కల జన్యువులకు సంబంధించిన సంబంధాలపై అధ్యయనం వీరి ప్రధాన విధి.

Job Opportunities : చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగవేటలో ఉన్నవారికి టీమ్ లీజ్ ఎడెటెక్ సంస్ధ సర్వే మార్గదర్శిని కానుంది. టెక్నాలజీ, సేవలు, తయారీ రంగాల్లో ఉన్న865 చిన్న, పెద్ద స్ధాయి సంస్ధలను సర్వేలో భాగం చేసుకుని టాప్ 5 ఉద్యోగాల జాబితాను టీమ్ లీజ్ ఎడెటెక్ రూపొందించింది. అవివరాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

1. వెలనెస్ స్పెషలిస్ట్ ; వెల్ నెస్ స్పెషలిస్ట్ లకు ప్రస్తుతం మంచి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. జీవనశైలి, శారీరక దృఢత్వంపై యువతలో ఆసక్తి పెరుగుతున్న నేపధ్యంలో వెల్ నెస్ ప్రణాళికల కోసం వెల్ నెస్ స్పెషలిస్ట్ లను ఆశ్రయిస్తున్నారు. అనేక హాస్పటల్స్, కౌన్సిలింగ్ సెంటర్స్, స్పాలు, జిమ్ లు, కమ్యూనిటీ సెంటర్ల వారు ఈ ఉద్యోగాలకు అభ్యర్ధులను నియమించుకుంటున్నారు.

2 అఫిలియేట్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ ; ప్రస్తుతం అఫిలియేట్ మార్కెట్ రంగంలో ఉపాధి అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఒక సంస్ధ తయారు చేసిన ఉత్పత్తని కొనుగోలు దారులకు చేరువయ్యేలా మార్కెటింగ్ చేయటం అన్నది వీరియొక్క ప్రధాన విధి. ప్రతికొనుగోలుపై వీరికి మార్జిన్ , కమిషన్ లభిస్తుంది. తక్కువ ఖర్చుతో తాము తయారు చేసిన ఉత్పత్తులను మార్కెటింగ్ చేయాలనుకునే సంస్ధలు అఫిలియేట్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ లను నియమించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి.

3. యూజర్ ఎక్స్ పీరియన్స్ రిసెర్చ్ ; వినియోగదారులు అవసరాలు ఏమిటో తెలుసుకునే పని యూజర్ ఎక్స్ పీరియన్స్ రిసెర్చర్ ప్రధాన విధి. చాలా సంస్ధలు తాము ఉత్పత్తి చేయబోయే వస్తువుల డిజైన్ విషయంలో వినియోగదారుల అభిరుచులకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తాయి. అయితే ఆపనిని యూజర్ ఎక్స్ పీరియన్స్ రిసెర్చర్లు నిర్వర్తిస్తారు.

4. మాలిక్యులర్ బయాలజిస్ట్ ; ప్రస్తుతం మాలిక్యులర్ బయాలజిస్టు ఉద్యోగాలకు మంచి అవకాశాలు ఉన్నాయి. మనుషుల, జంతువులు, మొక్కల జన్యువులకు సంబంధించిన సంబంధాలపై అధ్యయనం వీరి ప్రధాన విధి. సెల్ టైప్స్, డీఎన్ఏ, మానిఫెస్టేషన్స్ వంటి వాటిని వీరు అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం సెల్ పనితీరు పై అధ్యయనం చేసే మాలిక్యులర్ బయాలజిస్ట్ లకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి.

5. సైట్ రిలయబిలిటీ ఇంజినీర్ ; సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ మెలుకువలను ఐటీ ఇంజినీరింగ్ తో మిళితం చేయగలిగే సామర్ధ్యం కలిగిన వారిని సైట్ రిలయబిలిటీ ఇంజినీర్ గా పిలుస్తారు. ప్రస్తుతం జాబ్ మార్కెట్ లో వీరికి మంచి అవకాశాలు ఉన్నాయి. అప్లికేషన్స్, డేటాబేస్, హార్డ్ వేర్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ వంటి వాటిపై పట్టు ఉండాలి. కోడింగ్ , డేటా బేస్ పై అవగాహన ఉన్నవారికి ఉద్యోగ అవకాశాలు దండిగా ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు