AAI Recruitment: గేట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఏఏఐలో 976 జాబ్స్.. అర్హత, దరఖాస్తు, పూర్తి వివరాలు మీకోసం

గేట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI Recruitment) గుడ్ న్యూస్ చెప్పింది. సంస్థలో ఖాళీగా ఉన్న 976 జూనియర్

AAI Recruitment: గేట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఏఏఐలో 976 జాబ్స్.. అర్హత, దరఖాస్తు, పూర్తి వివరాలు మీకోసం

AAI Recruitment: Notification released for the recruitment of Junior Executive posts in AAI

Updated On : August 23, 2025 / 7:09 PM IST

AAI Recruitment: గేట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI Recruitment) గుడ్ న్యూస్ చెప్పింది. సంస్థలో ఖాళీగా ఉన్న 976 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబందించిన దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 28, 2025 నుంచి మొదలుకానుంది. సెప్టెంబర్ 27వ తేదీ వరకు కొనసాగుతుంది. కాబట్టి.. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ aai.aero ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Job Mela: బంపర్ ఆఫర్ మీకోసమే.. ప్రముఖ సంస్థల్లో 200 పైగా ఉద్యోగాలు.. అస్సలు మిస్ అవకండి

పోస్టులు, ఖాళీల వివరాలు:

ఈ పోస్టులలో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్ వంటి ఇంజినీరింగ్ విభాగాలకు ప్రాధాన్యత ఉంది.

  • జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఆర్కిటెక్చర్) 11 పోస్టులు
  • జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజినీరింగ్‐సివిల్) 199 పోస్టులు
  • జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజినీరింగ్‐ఎలక్ట్రికల్) 208 పోస్టులు
  • జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రానిక్స్) 527 పోస్టులు
  • జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) 31 పోస్టులు

విద్యార్హత:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. తప్పనిసరిగా గేట్ 2023/ 2024 /2025 పరీక్షలలో అర్హత సాధించి ఉండాలి.

వయోపరిమితి:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు సెప్టెంబర్ 27, 2025 నాటికి 27 సంవత్సరాలు మించకూడదు.

దరఖాస్తు ఇలా చేసుకోండి:

అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ aai.aero లోకి వెళ్ళాలి.

హోమ్ పేజీలో రిక్రూట్‌మెంట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి

తరువాత AAI JE Apply Online లింక్‌ పై క్లిక్ చేయాలి

రిజిస్ట్రేషన్ కోసం అవసరమైన వివరాలను ఎంటర్ చేయాలి

మీ వివరాలతో లాగిన్ అవ్వాలి

దరఖాస్తు ఫారమ్‌ను ఫిల్ చేయాలి

అవసరమైన పత్రాలు అప్లోడ్ చేయాలి

దరఖాస్తు రుసుము పే చేసి రసీదును అప్‌లోడ్ చేయండి.

తరువాత ఫారమ్‌ను సబ్మిట్ చేయాలి

తదుపరి అవసరాల కోసం దానిని డౌన్‌లోడ్ చేసుకోవాలి