Job Mela: బంపర్ ఆఫర్ మీకోసమే.. ప్రముఖ సంస్థల్లో 200 పైగా ఉద్యోగాలు.. అస్సలు మిస్ అవకండి
కనిగిరిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆగస్టు 25న జాబ్ మేళా(Job Mela) జరుగనుంది. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ కంపెనీలు

Job fair on August 25 at Government Degree College, Kanigiri
Job Mela: నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్. చదువు కంప్లీట్ అయ్యి మంచి జాబ్ కోసం ఎదురుచూస్తున్నారా. అయితే, అద్భుతమైన అవకాశం మీకోసం. కనిగిరిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆగస్టు 25న జాబ్‌మేళా జరుగనుంది. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ కంపెనీలు ఈ జాబ్ మేళా(Job Mela)లో పాల్గొనబోతున్నాయి. దాదాపు 200 పైగా ఉద్యోగాలను ఈ జాబ్ మేళా ద్వారా భర్తీ చేయనున్నారు. కాబట్టి, నిరుద్యోగ యువత ఈ అవకాశాన్నీ తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని జాబ్ మేళా నిర్వాహకులు తెలిపారు. ఇంకా ఈ జాబ్ మేళాకు సంబందించిన పూర్తి వివరాలు, సందేహాల కోసం 8008822821 ఈ నెంబర్‌ను సంప్రదించగలని సూచించారు.
సంస్థలు, ఉద్యోగ వివరాలు:
ఆరీస్ అగ్రో లిమిటెడ్ 20 ఖాళీలు
స్పందన స్పూర్తి ఫైనాన్షియల్ లిమిటెడ్ 50 ఖాళీలు
స్విగ్గీ – ఫుడ్ డెలివరీ సర్వీసెస్ 50 ఖాళీలు
డీబీఎస్ బ్యాంక్ 20 ఖాళీలు
రేస్ డైరెక్ట్ సర్వీసెస్ 20 ఖాళీలు
బజాజ్ అలియాన్స్ 25 ఖాళీలు
హెటెరో డ్రగ్స్ లిమిటెడ్ 100 ఖాళీలు
మాస్టర్ మైండ్స్ 30 ఖాళీలు ఉన్నాయి