Job fair on August 25 at Government Degree College, Kanigiri
Job Mela: నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్. చదువు కంప్లీట్ అయ్యి మంచి జాబ్ కోసం ఎదురుచూస్తున్నారా. అయితే, అద్భుతమైన అవకాశం మీకోసం. కనిగిరిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆగస్టు 25న జాబ్‌మేళా జరుగనుంది. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ కంపెనీలు ఈ జాబ్ మేళా(Job Mela)లో పాల్గొనబోతున్నాయి. దాదాపు 200 పైగా ఉద్యోగాలను ఈ జాబ్ మేళా ద్వారా భర్తీ చేయనున్నారు. కాబట్టి, నిరుద్యోగ యువత ఈ అవకాశాన్నీ తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని జాబ్ మేళా నిర్వాహకులు తెలిపారు. ఇంకా ఈ జాబ్ మేళాకు సంబందించిన పూర్తి వివరాలు, సందేహాల కోసం 8008822821 ఈ నెంబర్‌ను సంప్రదించగలని సూచించారు.
సంస్థలు, ఉద్యోగ వివరాలు:
ఆరీస్ అగ్రో లిమిటెడ్ 20 ఖాళీలు
స్పందన స్పూర్తి ఫైనాన్షియల్ లిమిటెడ్ 50 ఖాళీలు
స్విగ్గీ – ఫుడ్ డెలివరీ సర్వీసెస్ 50 ఖాళీలు
డీబీఎస్ బ్యాంక్ 20 ఖాళీలు
రేస్ డైరెక్ట్ సర్వీసెస్ 20 ఖాళీలు
బజాజ్ అలియాన్స్ 25 ఖాళీలు
హెటెరో డ్రగ్స్ లిమిటెడ్ 100 ఖాళీలు
మాస్టర్ మైండ్స్ 30 ఖాళీలు ఉన్నాయి