Today is the last date to apply for SBI Clerk posts.
SBI Clerk Posts: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI Clerk Posts) క్లర్క్ పోస్టుల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6589 క్లర్క్ ;పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనికి సంబందించిన దరఖాస్తు ప్రక్రియ ఇవాళ్టితో అంటే ఆగస్టు 26తో ముగియనుంది. కాబట్టి, అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://sbi.co.in/web/careers ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
AP DSC 2025 : డీఎస్సీ మెరిట్ అభ్యర్థులకు బిగ్ అప్డేట్.. నేడు కాల్ లెటర్లు.. ఈ సూచనలు తప్పనిసరిగా..
విద్యార్హత:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పూర్తి చేసి ఉండాలి.
డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కలిపించారు.
వయోపరిమితి:
అభ్యర్థుల వయసు 20 ఏళ్ల నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం, SC/ST, OBC, PWD వారికి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
స్థానిక భాషా పరిజ్ఞానం:
అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న రాష్ట్రంలోని స్థానిక భాషలో చదవడం, రాయడం, మాట్లాడటం తెలిసి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ:
నియామక ప్రక్రియ రెండు ప్రధాన దశల్లో జరుగుతుంది. మొదటిది ప్రిలిమినరీ పరీక్ష. రెండవది మెయిన్స్ పరీక్ష. ఈ రెండిటిలో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.