టౌన్ ప్లానింగ్ ఉద్యోగాల దరఖాస్తు ప్రారంభం

  • Publish Date - February 20, 2019 / 11:00 AM IST

ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్‌ విభాగంలో టౌన్‌ ప్లానింగ్‌ బిల్డింగ్ ఓవర్‌సీర్ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ( APPSC) ఉద్యోగ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సంబంధిత విభాగాల్లో డిప్లొమా లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.  

అభ్యర్థులు మార్చి 12లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ.80 చెల్లించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. (ఆన్‌లైన్ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి).

* ముఖ్యమైన తేదీలు.. 

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 19.02.2019 
ఫీజు చెల్లించడానికి చివరితేది 12.03.2019
దరఖాస్తుల సమర్పణకు చివరితేది 13.03.2019
మెయిన్ పరీక్ష 

21.05.2019

* వయసు పరిమితి: 
అభ్యర్థుల వయసు 18-42 సంవత్సరాల మధ్య ఉన్నవారు మాత్రమే అర్హులు.