DOST- 2019 అడ్మిషన్స్ మే 22కు వాయిదా

  • Publish Date - May 16, 2019 / 08:04 AM IST

తెలంగాణ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం ‘DOST’ ప్రవేశ ప్రకటన విడుదల మరోసారి వాయిదా పడింది. మే 15న విడుదల కావాలిసిన ప్రకటన కొన్ని కారణాల వల్ల మే 22న విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. మే 23 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అంతేకాదు ‘DOST’ ప్రవేశాలకు సంబంధించి విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక సహాయక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు లింబాద్రి పేర్కొన్నారు.

హైకోర్టు ఆదేశాల మేరకు ఇంటర్మీడియట్ రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాలు మే 27న విడుదల కానున్నాయని అందుకే DOST-2019 షెడ్యూల్‌లో మార్పులు చేసినట్లు DOST కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి తెలిపారు. ఈసారి ప్రవేశాల్లో విద్యార్థులు ఆన్‌లైన్‌లోనే ఫీజు చెల్లించి తమ సీటును ఖరారు చేసుకోవచ్చని లింబాద్రి తెలిపారు. ఆయా కళాశాలల్లో సీటు వచ్చిన విద్యార్థులకు జూలై 1 నుంచి తరగతులు ప్రారంభవుతాయని ఆయన వెల్లడించారు.