హైదరాబాద్: తెలంగాణలో సాంఘిక సంక్షేమ గురు కుల పాఠశాలల్లో ఐదో తరగతి ప్రవేశాల నోటిఫికేషన్ విడుదలైంది. ఫిబ్రవరి 18వ తేదీ సోమవారం నుంచి ఆన్‌లైన్‌లో అప్లికేషన్లు
హైదరాబాద్: తెలంగాణలో సాంఘిక సంక్షేమ గురు కుల పాఠశాలల్లో ఐదో తరగతి ప్రవేశాల నోటిఫికేషన్ విడుదలైంది. ఫిబ్రవరి 18వ తేదీ సోమవారం నుంచి ఆన్‌లైన్‌లో అప్లికేషన్లు స్వీకరిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గురుకులాల్లో కలిపి 49వేల 280 సీట్లు భర్తీ చేయనున్నారు. దరఖాస్తు రుసుమును ప్రభుత్వం రెట్టింపు చేసింది. 2018లో దరఖాస్తు రూ.50 ఉండగా ఈసారి ఆ మొత్తాన్ని రూ.100కు పెంచారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలు, విద్యాశాఖ పరిధిలో 497 గురుకుల స్కూల్స్ ఉన్నాయి. 2019-20 అకడమిక్ ఇయర్ బీసీ సంక్షేమ శాఖ పరిధిలో అదనంగా 119 గురుకుల పాఠశాలలు తెరిచేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 4 సొసైటీల పరిధిలో 616 గురుకుల స్కూల్స్ అందుబాటులోకి రానున్నాయి. ఒక్కో గురుకుల పాఠశాలలో 5వ తరగతి కింద 80మందికి ప్రవేశాలు కల్పించనున్నారు.
* గురుకుల పాఠశాలలో ప్రవేశానికి సంబంధించిన దరఖాస్తును ఆన్‌లైన్‌లో పూర్తిచేయాలి
* మీ సేవా కేంద్రాలు లేదా ఇంటర్నెట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు
* దరఖాస్తు సమర్పణ సమయంలోనే ఫీజు చెల్లించాలి
* ఫిబ్రవరి 18వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు.
* ఆధార్ వివరాల్ని కచ్చితంగా పొందుపరచాలి
* 616 గురుకులాల్లో ఐదో తరగతి సీట్లు 49,280
* మైనార్టీ గురుకులాలకు త్వరలో నోటిఫికేషన్
* ఏప్రిల్ 7వ తేదీన అర్హత పరీక్ష(ఉ. 11గంటల నుంచి మ. 1గంట వరకు పరీక్ష)
దరఖాస్తుకు సంబంధించి సందేహాల నివృత్తి, గురుకుల పాఠశాలలకు సంబంధించిన సమాచారం కోసం హెల్ప్‌లైన్ నంబర్ 1800-425-45678 నంబర్‌లో.. లేదా
http://tswreis.in, http://tresidential. cgg.gov.in, http://tgtwgurukulam, telangana.gov.in, http://mjptb cwreis.cgg.gov.in, http://tgcet.cgg. gov.in వెబ్‌సైట్‌లను చూడొచ్చు.
ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, విద్యాశాఖ సొసైటీల్లోని గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి సీట్ల భర్తీకి మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారు. మైనార్టీ గురుకుల పాఠశాలల కోసం ప్రత్యేక నియామక నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అన్ని గురుకుల సొసైటీల్లో 6 నుంచి 10వ తరగతి వరకున్న ఖాళీల భర్తీకి కూడా ప్రత్యేక నోటిఫికేషన్లు ఇస్తారు. ఈ విద్యాసంవత్సరం ముగిసిన తర్వాత ఏర్పడే ఖాళీలపై వీటి భర్తీ ఆధారపడి ఉంటుంది.
కేటగిరీల వారీగా గురుకుల పాఠశాలలు, ఐదో తరగతి సీట్ల సంఖ్య
కేటగిరీ | గురుకులాలు | సీట్లు |
ఎస్సీ | 232 | 18వేల 560 |
ఎస్టీ | 88 | 7వేల 040 |
బీసీ | 261 | 20వేల 880 |
జనరల్ | 35 | 2వేల 800 |