ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు, దరఖాస్తు గడువు శనివారం (మే 4)తో చివరితేది. వాస్తవానికి మే 2తో గడువు ముగియాల్సింది కానీ విద్యార్థులు, వారి తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ఫీజు చెల్లింపు గడువును ఇంటర్ బోర్డు మే 4 వరకు పొడిగించింది. ఇప్పటివరకు 2.80 లక్షలమందే దరఖాస్తు చేసుకున్నారు. కళాశాలల ప్రిన్సిపల్స్ కూడా ఆన్‌లైన్ ద్వారా బోర్డుకు చెల్లించాల్సిన ఫీజును మే 4లోగా చెల్లించాలి.
తెలంగాణలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు మే 25 నుంచి ప్రారంభంకానున్నాయి. బిట్‌శాట్, జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షల నేపథ్యంలో మే 26, 27 తేదీల్లో జరగాల్సిన సప్లిమెంటరీ పరీక్షలు తేదీల్లో కూడా మార్పులు చేయనున్నారు. జూన్ 1 వరకు పరీక్షలు కొనసాగుతాయి. జూన్ 3న ఎథిక్స్ & హ్యూమర్ వాల్యూస్ పరీక్ష, జూన్ 4న ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష నిర్వహించనున్నారు. అనంతరం జూన్ 7 నుంచి 10 వరకు ఇంటర్ సప్లిమెంటరీ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరగనున్నాయి.