తెలంగాణ పాలిసెట్ 2019 ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ప్రతి సంవత్సరం పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఈసారి పాలిసెట్ 2019 ప్రవేశ పరీక్షకు 1,03,591 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్షను రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణ మండలి నిర్వహించింది. ఏప్రిల్ 16, 2019 న ప్రవేశ పరీక్షను నిర్వహించారు.
ఫలితాలను హైదరాబాద్‌లోని బూర్గుల రామకృష్ణారావు భవనంలో ఉన్న SBTET ఆఫీసులో సాంకేతిక విద్యా శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ IAS విడుదల చేశారు. పరీక్ష రాసిన వారిలో 92.53 శాతం మంది అంటే 95,850 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ అర్హత పరీక్షలో మెరిట్ ఆధారంగా డిప్లొమా కోర్సుల్లో వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించి, సీట్లను కేటాయిస్తారు. దీనికి సంబంధించిన ప్రక్రియను త్వరలోనే వెల్లడించనున్నారు.
Also Read : నర్సు ఉద్యోగం ఇప్పిస్తామని మోసం చేశారు : ఆదుకోవాలని KCRకు లేఖ