తెలంగాణలోని యూనివర్సిటీలు, డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్లుగా పనిచేయడానికి అర్హత కల్పించే పరీక్ష తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటి టెస్ట్ (TSSET- 2019) షెడ్యూల్ ను ఉస్మానియా యూనివర్సిటీ విడుదల చేసింది. 2019 ఏడాది జూలై 5, 6 తేదీల్లో ఆన్‌లైన్ ద్వారా TS-SET నిర్వహించనున్నారు. మార్చి 27వ తేదీ నుంచి దరఖాస్తు స్వీకరణ ప్రారంభం అవుతుంది. సంబంధిత సబ్జెక్టులో PG ఉత్తీర్ణత ఉండాలి.
ప్రస్తుతం ఫైనల్ ఎగ్జామ్ రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 29 సబ్జెక్టుల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. మొదటి పేపర్‌లో 50 ప్రశ్నలకు 100 మార్కులు.. రెండో పేపరులో 100 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు. పరీక్ష సమయం 3 గంటలు.
TS-SET -2019 షెడ్యూల్ కోసం www.telanganaset.org క్లిక్ చేయండి.