తెలంగాణ గ్రూప్‌-2 తుది ఫలితాలు విడుదల

  • Publish Date - October 25, 2019 / 01:00 AM IST

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) అక్టోబరు 24న గ్రూప్-2 ఉద్యోగాల తుది ఫలితాలను విడుదల చేసింది. మొత్తం 1032 ఉద్యోగాల్లో 1027 మంది అభ్యర్థులను తుది జాబితాకు ఎంపిక చేసింది. 

ఇందులో 259 డిప్యూటీ తహసీల్దార్లు, 284 ఎక్సైజ్ ఎస్సైలు, 156 వాణిజ్య పన్నుల అధికారులు, మిగిలిన వారిని మున్సిపల్‌ కమిషనర్లుగా నియమించనున్నారట, ఇక మిగిలిన 5 పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు TSPSC ఛైర్మన్‌ ఘంటా చక్రపాణి తెలిపారు. 

ఈ సందర్భంగా గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన అభ్యర్ధులకు TSPSC ఛైర్మన్‌ ఘంటా చక్రపాణి అభినందనలు తెలిపారు. అంతేకాదు ఈ ఫలితాలు వెల్లడించడం కోసం పండుగ సెలవులు కూడా తీసుకోకుండా పనిచేసిన సిబ్బందికి కూడా అభినందనలు తెలిపారు.