తెలంగాణలో గ్రూప్-4 పోస్టుల ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) మంగళవారం (మార్చి 19,2019)న విడుదల చేసింది. అభ్యర్థుల ఎంపిక జాబితాను TSPSC అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచారు. ఇందులో గ్రూప్-4 పోస్టులకు సంబంధించి 2,72,132 మంది అభ్యర్థులు, ఆర్టీసీలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి 33,132 మంది అభ్యర్థులు, GHMC లో బిల్ కలెక్టర్ పోస్టుల భర్తీకి సంబంధించి 69,378 మంది అభ్యర్థులు, బేవరేజెస్ కార్పొరేషన్‌లో వివిధ పోస్టుల భర్తీకి సంబంధించి 19,545 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు.
తెలంగాణలో మొత్తం 1,595 గ్రూప్-4 పోస్టులతోపాటు ఆర్టీసీలో 72 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)లో 124 బిల్ కలెక్టర్ పోస్టులు, బేవరేజెస్ కార్పొరేషన్‌లో 76 పోస్టుల భర్తీకి అక్టోబరు 7న రాతపరీక్ష నిర్వహించారు. వీటి ఫలితాలనే తాజాగా విడుదల చేశారు.
Read Also : తక్కువ ధరలో ఎక్కువ ఉతుకు : MI వాషింగ్ మెషీన్స్ వస్తున్నాయి